అంబానీ ఇంటి రాజ‌కీయం...ముకేష్ కాంగ్రెస్‌కు..కొడుకు మోదీకి మ‌ద్ద‌తు

అంబానీ ఇంటి రాజ‌కీయం...ముకేష్ కాంగ్రెస్‌కు..కొడుకు మోదీకి మ‌ద్ద‌తు

సార్వ‌త్రిక ఎన్నిక‌లు అనేక చిత్రాల‌కు, ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల‌కు వేదిక‌గా మారుతున్నాయి. ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీల నుంచి బ‌రిలో దిగ‌డం, వేర్వేరు పార్ట‌ల‌కు మ‌ద్ద‌తివ్వ‌డం వంటి  చిత్రాలు ఎన్నో తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఇలాంటి ఆస‌క్తి ప‌రిణామాలు సామాన్యుల ఇంట్లో జ‌రిగిన‌ట్లే...మాన్యుల ఇంట్లోనూ జ‌రుగుతున్నాయి. ఆ మాన్యుల జాబితాలో తాజాగా నిలిచింది ఎవ‌రంటే...దేశంలోనే అత్యంత సంపన్నుడు అయిన ముకేష్ అంబాని. ఇటీవ‌లే ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌గా తాజాగా ఆయ‌న త‌న‌యుడు అనంత్ అంబానీ మోదీ స‌భ‌లో మెరిసి చ‌ర్చ‌కు తెర‌తీశారు.

దక్షిణ ముంబై నుంచి కాంగ్రెస్ టికెట్ పై మిలింద్ దేవరా పోటీ చేస్తున్నారు. త‌ను పోటీ గురించి మిలింద్ ఒక వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియోలో మిలింద్ దేవరా ట్వీట్ చేసిన వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ, కోటక్ మహీంద్ర గ్రూప్ యజమాని ఉదయ్ కోటక్ తమ మద్దతు ప్రకటించారు. వీళ్లతో పాటు ఎందరో చిరు వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా మిలింద్ కు తమ మద్దతు తెలియజేశారు. ఇలా సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల వరకు అంతా దక్షిణ ముంబైకి మిలింద్ దేవరా ఒక్కడే అత్యుత్తమ అభ్యర్థి అని పేర్కొన్నారు.

అయితే, తాజాగా ముఖేష్ త‌న‌యుడు అనంత్ అంబానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభ ఎన్నికల ప్రచార స‌భ‌లో క‌నిపించారు. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లో ప్ర‌ధాని బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభకు అంబానీ కుటుంబం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ హాజరయ్యారు. ఒక‌టే ఇలాకా నుంచి తండ్రి ఒక పార్టీకి, కొడుకు మ‌రో పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగానే కాకుండా సంచ‌ల‌నంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English