తెలంగాణపై మాట తప్పలేదంట

తెలంగాణపై మాట తప్పలేదంట

తెలంగాణపై మాట తప్పలేదంటున్నది తెలుగుదేశం పార్టీ. 2008లోనే తెలంగాణకు అనుకూలంగా ప్రణబ్‌ కమిటీకి లేఖ రాయడం జరిగిందని, దానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నదని మహానాడు వేదిక మీద ఆ పార్టీ నేతలు కొందరు చెప్పారు. చంద్రబాబు కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. గతంలో స్పష్టత ఇచ్చాం గనుక, ఇంకోసారి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు.

రాజకీయాల్లో నిన్నటికి, నేటికీ పరిస్థితుల్లో, సిద్ధాంతాల్లో, నిర్ణయాల్లో తేడాలుంటాయి. 2008లో తెలంగాణకు అనుకూలమని టిడిపి చెప్పగా, 2009 చివర్లోకొచ్చేసరికి ఆ పార్టీలోని సమైక్యవాద నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేశారు. అదే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నది తెలుగుదేశం. స్పష్టత ఎప్పుడో ఇచ్చేశామని చెప్పడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఏ సంకేతాలు పంపాలనకుంటున్నదోగానీ, స్పష్టత ఇవ్వలేని టిడిపి పరిస్తితి అందరికీ అర్థమవుతున్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు