తల దించుకోవాల్సి వస్తుందంట

తల దించుకోవాల్సి వస్తుందంట

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అవినీతి జరిగినట్లు న్యాయస్థానం ధృవీకరిస్తే కాంగ్రెసు పార్టీలో ఉన్న తామంతా తల దించుకోవాల్సి వస్తుందని చెప్పి సంచలనం సృష్టించారు పిసిసి అధ్యక్షుడి పనిచేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణగారు. తమకూ వైఎస్‌కీ సంబంధం లేదని కొన్నిసార్లు చెప్పడానికి ప్రయత్నించిన బొత్స, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియాల్సి ఉన్నది. 

తెరవెనుక పరిస్థితులు ఎలా ఉన్నా, బొత్స వ్యాఖ్యలు కొంతవరకు కాంగ్రెసు పార్టీని ఇబ్బందుల్లో పడవేస్తాయి. తెరవెనుక ఒప్పందాలు చేసుకున్నారని అర్థం వచ్చేలా వైఎస్‌ని విమర్శించడానికీ వెనుకాడలేదు బొత్స సత్యనారాయణ. ఆయన ఏం చెప్పినా, వైఎస్‌ పాలనలో అవినీతి జరిగితే, ఆయన క్యాబినెట్‌లో పనిచేసిన బొత్సతో పాటు మిగతావారూ దోషులే అవుతారు. అది ఇప్పటికి బొత్సకు తెలిసింది. కాని గతంలో బుకాయించారుగా, అందుకే ఇప్పుడే ప్రత్యర్థులకు ఇలా చిక్కేశారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English