అలా ముందే జరిగి ఉంటే 20 మంది బ్రతికేవారా

అలా ముందే జరిగి ఉంటే 20 మంది బ్రతికేవారా

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో వివాదం చోటు చేసుకోవడం అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థుల్లో తీవ్ర ఆవేశానికి ఆవేదనకు కారణమయ్యాయి.. ముఖ్యంగా మార్కుల విషయంలో చోటు చేసుకున్న మార్పులు, అడుగడుగునా కనిపించిన బోర్డు నిర్లక్ష్యం, అధికారుల పొంతనలేని సమాధానాలు ఇక్కడే కాదు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి.. అటు ఇంటర్ గానీ ఇటు టెన్త్ క్లాస్ ఫలితాలు వచ్చినప్పుడు ఫలితాలు ప్రతికూలంగా వచ్చిన సందర్బంలో కొందరు విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్బలూ గతంలోనూ ఉన్నాయి..

కానీ ఈ సారి మాత్రం ఆ సంఖ్య 20 కి దాటడం నిజంగా సంచలన విషయమే.. అయితే విద్యార్థులందరూ మార్కుల విషయంలో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్ల చనిపోయారా లేక ఫలితాలు ఊహించే తనువు చాలించారా అనేది పక్కన పెడితే... ముఖ్యంగా ప్రభుత్వ స్పందన అంతంత మాత్రంగానే ఉండటం .. చాలా ఆలస్యం గా ముఖ్యమంత్రి స్పందించడం కూడా కారణమయ్యాయా అన్న చర్చ జరుగుతోంది..

ముఖ్యమంత్రి ముందే స్పందించి ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులు బతికే వారంటూ టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా ఇంతటి ఘోరానికి కారణమైన విద్యా శాఖ అధికారులపైన గానీ, గ్లోబరీనా సంస్థపై గానీ సీఎం చర్యలు తీసుకోలేదని విజయశాంతి పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు కలెక్టరేట్ల ముందు ఆందోళనలు నిర్వహించారు..

అయితే పార్టీల పరంగా కాంగ్రెస్ కూడా ఈ సమస్యపై ఆలస్యంగా స్పందించదనే విమర్శ కూడా ఆ పార్టీ ఎదుర్కొంటోంది.. సీఎం ఆలస్యంగా స్పందించారు సరే.. అది మూమ్మాటికీ ఉదాసీన వైఖరే.. కాదనం.. కానీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న ( త్వరలో హోదా కోల్పోనున్నారు ) కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా స్పందించడంపై కూడా విమర్శలు వినవస్తున్నాయి...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English