వార‌ణాసి బ‌రిలో ప్రియాంక నో...రాహుల్ స్కెచ్చేనా?

వార‌ణాసి బ‌రిలో ప్రియాంక నో...రాహుల్ స్కెచ్చేనా?

``కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీ చేస్తా`` ఇది ఆ పార్టీ యువ‌నేత‌, ప్రియాంక గాంధీ ప్ర‌క‌ట‌న‌. వారణాసి నుంచి ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందిస్తూ పార్టీ ర‌థ‌సార‌థి ఓకే అంటే తాను సిద్ధంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే,  ఆ వార్తలకు ఇవాళ ఉదయం కాంగ్రెస్‌ పార్టీ తెర దించింది. 2014 ఎన్నికల్లో మోదీపై పోటీ చేసిన అజయ్‌ రాయ్‌నే కాంగ్రెస్‌ పార్టీ మరోసారి బరిలోకి దింపింది. ప్రియాంక‌కు కాంగ్రెస్ పెద్ద‌లు నో చెప్ప‌డం వెనుక ప్ర‌త్యేక‌ కార‌ణాలు ఉన్న‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే పార్టీలోకి అధికారికంగా రంగ ప్రవేశం చేసిన ప్రియాంక‌గాంధీ స్వ‌యంగా వార‌ణాసిలో పోటీ చేయ‌డం గురించి ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికీ...ఆమెను బ‌రిలో ఉంచ‌కుండా....2014లోనూ మోదీపై అజ‌య్ రాయ్ పోటీ చేసి ఓట‌మి పాల‌యిన అయినా అజ‌య్‌రాయ్‌కే అవ‌కాశం ఇచ్చారు. కాంగ్రెస్ పెద్ద‌లు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం వ్యూహాత్మ‌క‌మేన‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఊపునిచ్చిన నాయ‌కురాల‌కి అవ‌కాశం ఇవ్వ‌కుండా..ఓట‌మి పాల‌యిన వ్య‌క్తికే చాన్స్ ఇవ్వ‌డం వెనుక రాహుల్ వ్యూహం ఉంద‌ని అంటున్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం ప్రియాంక‌ను పోటీ చేసే విష‌యంపై ఆస‌క్తి చూప‌లేదని తెలుస్తోంది. ఇందుకు రాహుల్ పోటీ చేయ‌డ‌మే కార‌ణ‌మంటున్నారు. రాహుల్ ప్ర‌స్తుతం రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అమేథీతో పాటు కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో పోటీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల ఆయ‌న గెలిచాక అమేథీని వ‌ద‌లుకుని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తార‌న్న ప్ర‌చారం ఉంది. దీంతో మ‌రో ఆరు నెల‌ల్లో అమేథీలో ఉప ఎన్నికలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. అక్క‌డి నుంచి ప్రియాంక‌ను బ‌రిలో దించే ఉద్దేశంతో ఈ ఎన్నిక‌ల్లో పోటీకి నిల‌ప‌డం లేద‌ని పేర్కొంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English