సాయిరెడ్డికి వైసీపీ అభిమాని పంచ్ !

సాయిరెడ్డికి వైసీపీ అభిమాని పంచ్ !

వైసీపీ కీల‌క నేత‌, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు వేణుంబాక విజ‌య‌సాయిరెడ్డికి ఇప్పుడు పంచ్ ల మీద పంచ్ లు ప‌డుతున్నాయి. బ‌య‌ట మీడియాతో మాట్లాడేదాని కంటే కూడా నిత్యం ట్విట్ట‌ర్ లోనే విమ‌ర్శ‌లు సంధిస్తూ ట్విట్ట‌ర్ పులిగా మారిన సాయిరెడ్డి... జ‌న‌సేన విశాఖ ఎంపీ అభ్య‌ర్థి, మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌నుఇటీవ‌లే కెలుక్కుని ఇర‌కాటంలో ప‌డ్డారు. తాజాగా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడును గీకిన సాయిరెడ్డి నెటిజ‌న్ల‌కు అడ్డంగా బుక్కైపోయారు. అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టే విష‌యంలో చంద్ర‌బాబును మించిన వారు లేర‌న్న కోణంలో ట్వీట్ ను సంధించిన సాయిరెడ్డి... *ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం దేశంలో మొదలు పెట్టిందే చంద్రబాబు దివాకర్ రెడ్డి గారూ. వెన్నుపోటు తర్వాత 1996 లోక్ సభ ఎన్నికల్లో రూ.500 నోట్లు వెదజల్లిన చరిత్ర బాబుది. ప్రస్తుత ఎన్నికల్లో మీ పార్టీ పెట్టిన ఖర్చు రూ.20 వేల కోట్ల పైనే. అయినా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు* అంటూ ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ పై టీడీపీ నేత‌లు స్పందించేలోగానే సాయిరెడ్డి ట్వీట్ లోని ఓ బ్లండ‌ర్ ను ఆస‌రా చేసుకుని నెటిజ‌న్లు ఆయ‌న‌ను ఏకిపారేశారు. ఓ నెటిజ‌న్ అయితే ఏకంగా సాయిరెడ్డి ఆడిటింగ్ క‌ళ‌ను కూడా ప్ర‌స్తావించి మైండ్ బ్లాంక‌య్యే రీ ట్వీట్ పోస్ట్ చేశారు. వైసీపీ అభిమానిగా క‌నిపించిన స‌ద‌రు నెటిజ‌న్ ఏమ‌న్నారంటే... *జ‌గ‌న‌న్నపై అభిమానం ఉన్నా నీ ట్వీట్లు నీ వైఖ‌రితో ఓటు వేసే వాడు కూడా వేసి ఉండ‌డు. 1997లో 500 నోటును ముద్రిస్తే 1996లో ఎలా పంచుతాడు. క‌నీస అవ‌గాహ‌న లేకుండా ఎందుకిలా ఆడిట‌ర్ గారూ* అంటూ త‌న‌దైన శైలి పంచ్ వేశారు. ఏ విష‌యంపై అయినా కాస్తంత గ్రౌండ్ వ‌ర్క్ తోనే విమ‌ర్శ‌లు సంధించే సాయిరెడ్డి... నిజంగానే ఈ ట్వీట్ లో 500 నోట్ల‌పై క‌నీస అవ‌గాహ‌న లేకుండానే వ్య‌వ‌హ‌రించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English