క‌విత ప్యాకేజీ...మోదీపై తెలుగు రైతుల పోటీ

క‌విత ప్యాకేజీ...మోదీపై తెలుగు రైతుల పోటీ

నిజామాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం కేంద్రంగా జ‌రుగుతున్న రాజ‌కీయాలు మ‌లుపులు తిరుగుతున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై దాదాపు 180 మంది రైతులు పోటీలో నిల‌వ‌డం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా గిన్నిస్ రికార్డ్ సృష్టించే స్థాయిలో ఈవీఎంల‌ను ఉప‌యోగించి ఇక్క‌డి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించారు. అయితే, ఈ ఉదంతం మ‌రో మ‌లుపు తిరిగిన సంగ‌తి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నికల ద్వారానే ఢీకొనాలని నిజామాబాద్‌ పసుపురైతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గం నుంచి 50 మంది రైతులు పోటీచేయడానికి సిద్ధమయ్యారు.

అయితే, ఈ పోటీ వెనుక లెక్క‌లు వేరే ఉన్నాయ‌ని బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్ వెల్ల‌డించారు. బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న అంశాలు తెలిపారు. క‌విత త‌న వైఫ‌ల్యాల‌ను కప్పిపుచ్చుకోవ‌డానికి వార‌ణాసిలో నామినేష‌న్లు అంటూ కొత్త  ప‌బ్లిసిటీ స్టంట్ చేస్తున్నార‌ని ఆరోపించారు. ఈ పదిమంది రైతులు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదని ఆయ‌న అన్నారు. ``వీరంతా మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ కండువాలు మెడలో వేసుకుని‌ ఆ పార్టీ కోసం పనిచేశారు. వీరంతా టీఆర్ఎస్ క్రియాశీలక సభ్యులు. ఇందులో వ్యవసాయం చేసేవారు సగం మందే..అందులోనూ పసుపు పండించే రైతు ఒక్కరు కూడా లేరు.`` అని వ్యాఖ్యానించారు.

నిజామాబాద్ లో పసుపు బోర్డు  ఏర్పాటు చేస్తామ‌ని బీజేపీ 2014లో ఎక్క‌డ కూడా  వాగ్దానం చేయ‌లేదని, కేవ‌లం టీఆర్ఎస్ త‌ర‌పున  పోటీలో ఉన్న క‌విత మాత్ర‌మే  పసుపుబోర్డు తీసుకువ‌స్తా అని హామీ ఇచ్చింద‌ని అర‌వింద్ అన్నారు. ``ఎంపీగా గెలిచిన త‌ర్వాత  కేంద్రం దృష్టికి  ప‌సుపు రైతుల స‌మ‌స్య‌ల‌ను తీసుకుపోవ‌డంలో పూర్తిగా విఫ‌లం అయ్యింది.  కేంద్రానికి స‌మ‌స్య వివ‌రించ‌కుండా ఇత‌ర  రాష్ట్రాల సీఎం ల‌ను క‌లిసి కేవ‌లం రాజ‌కీయాలు మాత్ర‌మే చేసింది. మ‌రోవైపు నిజామాబాద్ లో ప‌సుపు కొనుగోలు ద‌ళారుల‌ను కాంగ్రెస్ పోషిస్తే, టీఆర్ఎస్ వారిని నెత్తికెక్కించుకుంది.  టీఆర్ఎస్ పార్టీ  రైత‌ల‌ను పూర్తిగా విస్మ‌రించింది అని చెప్ప‌డానికి  ప్ర‌త్య‌క్ష ఉద‌హార‌ణ చ‌క్కెర ఫ్యాక్ట‌రీల‌ను తెర‌వ‌కపోవ‌డం. రైతుల‌ను  య‌జ‌మానులు చేస్తాం అని ఢాంబికాలు ప‌లికిన  టీఆర్ఎస్  క‌నీసం కోఆప‌రేటివ్ షుగ‌ర్ ఫ్యాక్టరీని కూడా ఎందుకు తెర‌వ‌లేదు, తెరిస్తే నేరుగా రైతులు ఫ్యాక్ట‌రీలో భాగ‌స్వాములు అయ్యేవారు కాదా అని సూటిగా ప్ర‌శ్నిస్తున్నాను.  అదే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ లో మాత్రం రైతులు ముందుకు వస్తే..చేస్తాం అన్నారు... కవిత గత ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని ఇచ్చిన హామీని మరచిపోయారు. పసుపు రైతులపై కవితకు నిజమైన ప్రేమ ఉండి ఉంటే ఎందుకు బోనస్ ఇప్పించలేదు.`` అని ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ నేత‌లు వార‌ణాసిలో బ‌రిలో దిగ‌డం సమ్మర్ స్పాన్సర్ ప్యాకేజీయేన‌ని అన్నారు. నామినేషన్లు వేసే వాళ్లంతా అ తరువాత సమ్మర్ ఎంజాయ్ ప్రోగ్రామ్ కు వెళ్తున్నారని అర‌వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదంతా రాజకీయ డ్రామా అని ఆరోపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English