లిస్ట్ లో పేరు లేకున్నా ఓటేసిన న‌టుడు.. ఈసీ ఫైర్!

లిస్ట్ లో పేరు లేకున్నా ఓటేసిన న‌టుడు.. ఈసీ ఫైర్!

ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల్ని మార్చాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందా? అంటే అవున‌న్న మాట వినిపిస్తోంది. ఒకేలాంటి త‌ప్పున‌కు ఒకేలాంటి శిక్ష విధించ‌టం న్యాయం. కానీ.. అందుకు భిన్నంగా ఉన్న ఈసీ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.

ఓట‌ర్ల జాబితాలో ఓటు లేన‌ప్పుడు ఓటు వేయ‌టం నేరం. దీనికి ఎవ‌రూ కాద‌న‌లేరు. మ‌రింత క‌రెక్ట్ గా రూల్ ను అమ‌లు చేస్తున్న‌ప్పుడు.. న్యాయంగా ఉండాల్సిన ఓటును.. ఇష్టారాజ్యంగా తీసేయ‌టం..అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఓట‌రుజాబితా నుంచి గ‌ల్లంతు కావ‌టానికి ఎవ‌రు బాధ్య‌త వ‌హిస్తార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఇంత‌కీ ఈ వాద‌న ఎందుకొచ్చిందంటే.. ఓట‌రు జాబితాలో పేరు లేకున్నా త‌మిళ న‌టుడు శివ‌కార్తికేయ‌న్ ఓటు వేశారు. దీనిపై ఈసీ సీరియ‌స్ అయ్యింది. ఓట‌ర్ల జాబితాలో పేరు లేకున్నా ఓటు ఎలా వేశారు?  ఇది క‌చ్ఛితంగా స‌ద‌రు ఎన్నిక‌ల కేంద్రం అధికారుల త‌ప్పిదంగా ఈసీ ఫైర్ అవుతోంది.

ఈ ఆగ్ర‌హాన్ని అర్థం చేసుకోగ‌లం. మ‌రి.. శివ‌కార్తికేయ‌న్ ఓటు ఎలా వేయ‌గ‌లిగారు? అన్న సందేహాన్ని ఆయ‌న్నే అడిగితే.. తాను స్పెష‌ల్ ప‌ర్మిష‌న్ తీసుకున్న‌ట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఓట‌రు లిస్ట్ లో ఓటు లేకున్నా ఓటు వేస్తే ఈసీకి అంత కోపం వ‌చ్చింది క‌దా?  మ‌రి.. ఓట‌ర్ల లిస్ట్ లో ఓటు ఉండి.. త‌ర్వాత గ‌ల్లంతైన ల‌క్ష‌లాది మంది సామాన్యుల మాటేమిటి?  ఇలాంటి వాటి విష‌యంలో సింఫుల్ గా సారీ చెప్పే ఈసీ.. ఇలాంటి ఉదంతాల్లోకూడా సీరియ‌స్ చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంది క‌దా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English