సోష‌ల్‌మీడియాలో ట్రోలింగ్‌..మోదీ ఇలా రియాక్ట‌య్యాడు

సోష‌ల్‌మీడియాలో ట్రోలింగ్‌..మోదీ ఇలా రియాక్ట‌య్యాడు

సోష‌ల్ మీడియాను పూర్తిగా వాడుకునే నేత‌ల్లో...ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ టాప్‌లో ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. 2014 ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైన నాటి నుంచి ఆయ‌న సామాజిక మాధ్య‌మాల అండ‌గా త‌న గ్రాఫ్ పెంచుకున్నారు. మిగ‌తా నాయ‌కుల కంటే ముందు వ‌రుస‌లోకి చేరారు. అలా ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న మోదీ అనేక సంద‌ర్భాల్లో అదే సోష‌ల్ మీడియా వేదిక‌గా అనేక సంద‌ర్భాల్లో ట్రోలింగ్‌కు గుర‌య్యారు. కొన్నిసార్లు దీనిపై బీజేపీ శ్రేణులు భ‌గ్గుమ‌న్నాయి కూడా. అయితే, వీటికి మోదీ ఎలా స్పందిస్తార‌నే ఆస‌క్తి స‌హ‌జంగానే ఉంటుంది. దీనికి తాజాగా మోదీ జ‌వాబిచ్చారు.

ప్రధాని నరేంద్రమోదీతో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వ‌హించారు. పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు మోదీ సమాధానాలిచ్చారు. సోషల్ మీడియాలో త‌నపై జోకుల్ని వేస్తే ఎంజాయ్ చేస్తుంటానని మోదీ పేర్కొన్నారు. జోకుల్లో ఉన్న క్రియేటివిని తాను చూస్తానని వెల్ల‌డించారు. సన్యాసి జీవితాన్నే తాను ఇష్టపడతానని మోదీ పేర్కొన్నారు. త‌నతో సమావేశాల్లో ఎవరూ మొబైల్ ఫోన్లు ఉపయోగించరని, అయితే అలాగే తాను కూడా ఎవరితోనైనా భేటీ అయినప్పుడు ఫోను వాడనని మోదీ వెల్ల‌డించారు.

సైన్యంలో చేరి దేశసేవ చేయాలనుకున్నాన‌ని, తాను ప్రధానమంత్రి అవుతానని అసలు ఊహించలేదని న‌రేంద్ర‌మోదీ చెప్పుకొచ్చారు. ప్రధాని కావాలని తానెప్పుడూ కలగనలేదని, కుటుంబ ప్రమేయంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను కఠినంగా ఉంటానని, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మాత్రం అనుకోనని అన్నారు. స్కూల్ సమయంలో బ్యాంక్ ఖాతా తెరిచినా డబ్బులు వేయలేద‌ని, 32 సంవత్సరాలు జీరో బ్యాలెన్స్‌తో అది కొనసాగిందన్నారు. ప్రధాని అయ్యాక ఒక్క సినిమా కూడా చూడలేదని, సాయంత్రం వేళ ఆరుబయట ఒంటరిగా టీ తాగుతూ సరదాగా గడపడం అంటే ఇష్టమ‌ని మోదీ త‌న ఆస‌క్తుల‌ను వెల్ల‌డించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English