బాబుపైకి ఐఏఎస్‌ల ప్లాన్ రివ‌ర్స్ అయ్యిందే!

బాబుపైకి ఐఏఎస్‌ల ప్లాన్ రివ‌ర్స్ అయ్యిందే!

ఏపీలో ఇప్పుడు విచిత్ర ప‌రిస్థితి నెలకొంది. ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌భుత్వం ఉండ‌గానే... ఎన్నిక‌ల కోడ్ పేరిట కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. కోడ్ పేరిట ఎక్క‌డిక‌క్క‌డ గొళ్లేలు బిగిస్తూ వ‌స్తోంది. ఎన్నిక‌ల పోలింగ్ కు స‌మ‌యం ఆస‌న్న‌మైన వేళ‌... ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌రరావును బ‌దిలీ చేసి చంద్ర‌బాబు స‌ర్కారుకు షాకిచ్చిన ఈసీ... ఎల్లుండి పోలింగ్ అన‌గా... రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను బ‌దిలీ చేసి ఆ స్థానంలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంను నియ‌మించింది. అయితే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై న‌మోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎల్వీ కూడా నిందితులే.

అయితే ఆ త‌ర్వాత కోర్టు ఆయ‌న‌పై కేసు కొట్టివేసింది. మొత్తంగా ఎన్నిక‌ల వేళ‌.. విప‌క్ష నేతపై ఉన్న అవినీతి ఆరోప‌ణ‌ల‌తో సంబంధం ఉందంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన అధికారిని సీఎస్‌గా ఎలా నియ‌మిస్తార‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ఈ ఆరోపణ‌ల‌ను ప‌ట్టించుకోని ఈసీ... త‌న నిర్ణ‌యం మేర‌కే వ్య‌వ‌హ‌రించింది. దీనిపై సీఎంగా ఉన్న చంద్ర‌బాబు... ఎల్వీ వ్య‌వ‌హార స‌ర‌ళిపై నోరు విప్పారు. సీఎస్ పైనే నోరుపారేసుకుంటారా? అంటూ కొంద‌రు ఐఏఎస్ లు చంద్ర‌బాబుపై ఏకంగా యుద్ధానికే దిగేందుకు తెర వెనుక మంత్రాంగం నిర్వ‌హించారు. ఈ త‌తంగం అంతా ఎల్వీ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌న్న విమ‌ర్శ‌లు కూడా లేక‌పోలేదు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం ఐఏఎస్ ఆఫీస‌ర్ల మీటింగ్ అంటూ ఏపీలోని అంద‌రు ఐఏఎస్ ల‌కు ఆహ్వానాలు అందాయి.

అధికారుల మ‌నోభావాలను దెబ్బ‌తీసేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆరోపించ‌డంతో పాటుగా చంద్ర‌బాబుపై ఎలాంటి యుద్ధం చేద్దామ‌న్న విష‌యంపై చ‌ర్చించేందుకే ఈ స‌మావేశాన్ని ఏర్పాటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. మెజారిటీ ఐఏఎస్‌లు ఈ భేటీకి హాజ‌ర‌వుతార‌ని భావించినా.. కేవ‌లం ఓ 8 మంది మాత్ర‌మే ఈ స‌మావేశానికి రావ‌డంతో ఏం చేయాలో పాలుపోని ఈ భేటీ సూత్రధారి.... ఈ స‌మావేశం ఐఏఎస్ అసోసియేష‌న్ కు సంబంధించిందేన‌న్న క‌ల‌రింగ్ ఇచ్చార‌ట‌. మొత్తంగా త‌మ ఆహ్వానాల‌కు స్పంద‌న ల‌భించ‌క‌పోవ‌డంతో...చంద్ర‌బాబుపైకి ఐఏఎస్ పోరాటం అంతా రివ‌ర్స్ అయిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English