నిజ‌మైన ప‌ప్పు రాహుల్ కాదు....మోడీయేన‌ట‌

నిజ‌మైన ప‌ప్పు రాహుల్ కాదు....మోడీయేన‌ట‌

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని 'పప్పు' అని సాధారణంగా బీజేపీ నేత‌లు వ్యాఖ్యానించే సంగ‌తి తెలిసిందే. ప‌ప్పు పేరుతో సోష‌ల్ మీడియా ట్రోలింగ్‌ల‌కు కూడా పాల్ప‌డుతుంటారు. అయితే, అస‌లు పప్పు రాహుల్ కాద‌ని అంటున్నారు బీజేపీ మాజీ నేత‌, కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత నాయ‌కుడు శ‌తృఘ్న సిన్హా. కాంగ్రెస్‌ కార్యక్రమాల్లో నరేంద్ర మోడీని.. 'ఫేకూ'(నకిలీ హామీలిచ్చారని పేర్కొంటూ) అని పరోక్షంగా సంబోధిస్తుండ‌టాన్ని ప్ర‌స్తావిస్తూ మోడీపై విరుచుకుప‌డ్డారు. గుజారత్‌లోని వడోదరాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సిన్హా మాట్లాడుతూ గతేడాది చివరిలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ చేతిలో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో నిజమైన పప్పు ఎవరో అందరికి తెలిసివచ్చిందని మోడీని ఉద్దేశిస్తూ సిన్హా వ్యాఖ్యానించారు.

రాహుల్‌ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన ఏడాదిలోనే హిందీ బెల్ట్‌ రాష్ట్రాల్లో బీజేపీని ఓడించి విజయఢంకా మోగించారని, దీంతో 'పప్పు' ఎవరో నిరూపితమైందని సిన్హా ఎద్దేవా చేశారు. ప్ర‌స్తుత  ఓటమి తర్వాత ఎవరు పప్పునో, ఎవరు బూటకపు హామీలనిచ్చి ఫేకూగా అవతరించారో ప్రజలే చెబుతారని అన్నారు. మోడీ మళ్లీ ప్రధాని కాబోరని, అయినప్పటికీ 2022, 2024, 2029... లలోనూ నకిలీ వాగ్దానాలిస్తూనే ఉంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావ‌డం ఖాయ‌మ‌ని సిన్హా వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా తాను ఎందుకు మోడీని వివ‌రిస్తానో సిన్హా వివ‌రించారు. నోట్ల రద్దు, జీఎస్టీలాంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలను మోడీ తీసుకున్నారని, అవి తీసుకునేముందు సీనియర్‌ నేతలు, క్యాబినెట్‌ మంత్రులనూ సంద్రించలేదని అన్నారు. అందుకే తాను మోడీని విమర్శిస్తుంటానని  చెప్పారు.ప్రధాని మోడీపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టిన సిన్హా బీజేపీ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English