బాబుకు పేరు రావొద్దు!... అభివృద్ధి ఆగినా ఫ‌ర‌వా లేదు!

బాబుకు పేరు రావొద్దు!... అభివృద్ధి ఆగినా ఫ‌ర‌వా లేదు!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మామూలు కుట్ర‌లు అమ‌లు చేయ‌డం లేదు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో రెండు ఎంపీ సీట్లు, నాలుగు ఎమ్మెల్యే సీట్ల‌ను ద‌క్కించుకున్న బీజేపీ...  పొత్తు కుదిరిన సంద‌ర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను నెర‌వేర్చ‌డంలో మాత్రం ఆస‌క్తి చూప‌లేదు. నాలుగేళ్ల పాటు హామీల అమ‌లు కోసం ఢిల్లీ చుట్టూ ప్ర‌ద‌క్షిణ‌లు చేసినా ప‌ట్టించుకోని నేప‌థ్యంలో చివ‌రి బ‌డ్జెట్ దాకా వేచి చూసినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో బీజేపీతో పొత్తును చంద్ర‌బాబు తెంచేసుకున్నారు. పొత్తు ఉన్న‌నాడే... చంద్ర‌బాబు ఆవేద‌న‌ను ఆల‌కించని బీజేపీ... పొత్తును తెంచేసుకున్న త‌ర్వాత చంద్ర‌బాబును మ‌రింత‌గా టార్గెట్ చేసింది.

ఈ క్ర‌మంలో అస‌లు ఏపీలో ప‌లు అభివృద్ధి ప‌నులు జ‌రిగితే ఎక్క‌డ చంద్ర‌బాబుకు మైలేజీ వ‌స్తుందోన‌న్న భ‌యంతో ప‌రిపాల‌న అనుమ‌తులు ఇచ్చి కూడా ప‌నుల‌ను అట‌కెక్కించేసింది. బీజేపీతో చంద్ర‌బాబు క‌లిసి ఉన్న నాడే ఈ త‌ర‌హా కుట్ర‌ల‌కు తెర తీసిన బీజేపీ... పొత్తు ముగిసిన త‌ర్వాత ఆ కుట్ర‌ల‌కు మ‌రింత‌గా ప‌దును పెట్టింది. ఇందుకు నిద‌ర్శ‌నంగా ఓ నిలువెత్తు ఉదాహ‌ర‌ణ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. చెన్నై- కోల్ క‌తా జాతీయ ర‌హ‌దారి ఏపీ మీదుగానే వెళుతున్న విష‌యం తెలిసిందే క‌దా. ఏపీకి సంబంధించి చిత్తూరు జిల్లాలో ప్ర‌వేశించే ఈ ర‌హ‌దారి శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురం వ‌ద్ద ఎండ్ అవుతుంది. అంటే... ఈ జాతీయ ర‌హ‌దారి ఏపీలో వెయ్యి కిలో మీట‌ర్ల మేర ఉంది. ఈ ర‌హ‌దారి ఆధునీక‌ర‌ణకు కేంద్రం ఎప్పుడో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఏడాదిన్న‌ర క్రిత‌మే ప‌రిపాల‌న అనుమ‌తులు కూడా మంజూరైపోయాయి. నిధులు కూడా విడుద‌లైపోయాయి.

అయితే ప‌నులు మాత్రం మొద‌లు కాలేదు. అంటే.. టీడీపీతో పొత్తు కొన‌సాగిన కాలంలోనే ఈ ప‌నుల‌కు కేంద్రం అనుమ‌తులిచ్చింద‌న్న మాట‌. అయితే ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ ప‌నులు మొద‌లైతే చంద్ర‌బాబుకు ఎక్క‌డ పేరు వ‌స్తుందోన‌న్న భ‌యంతోనే బీజేపీ స‌ర్కారు.. నిధులు మంజూరు చేసిన‌ప్ప‌టికీ ప‌నులు ప్రారంభం కాకుండా పావులు క‌దిపింది. ఇక ఆ త‌ర్వాత త‌న‌తో టీడీపీ పొత్తు తెంచుకున్న త‌ర్వాత ఇక ఆ ప‌నుల వైపు చూడ‌నే లేదు. ఇప్పుడు ఎన్నిక‌లు అయిపోయిన నేప‌థ్యంలో ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో టీడీపీ నేత‌లు భ‌గ్గుమంటున్నారు. పార్టీల మ‌ధ్య అభిప్రాయ బేధాలుంటే అభివృద్ధి ప‌నుల‌నే అడ్డుకుంటారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English