ఫైర్‌బ్రాండ్ జ‌గ్గారెడ్డి ఆఖ‌రికి ఇలా అయిపోయాడు

ఫైర్‌బ్రాండ్ జ‌గ్గారెడ్డి ఆఖ‌రికి ఇలా అయిపోయాడు


జ‌గ్గారెడ్డి...అలియ‌స్ అయిన ఈ పేరుతోనే...అస‌లు పేర‌యిన తూర్పు జయప్రకాష్ రెడ్డి కంటే సుప‌రిచితుడు అయిన నేత‌. కాంగ్రెస్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే అయిన జ‌గ్గారెడ్డి ఫైర్‌బ్రాండ్ నేత‌గా సుప‌రిచితుడు. తెలంగాణా సీఎం కేసీఆర్ అంటే విరుచుకుప‌డే నేత‌గా ఆయ‌న గురించి అంద‌రికీ తెలుసు. అయితే, గ‌త కొద్దికాలంగా, కేసీఆర్ విష‌యంలో త‌న దారిని మార్చుకున్నారు. ఒకప్పుడు కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన జగ్గారెడ్డి ఇటీవ‌ల వ‌రుస‌గా పొగడ్తల్లో ముంచెత్తారు. అయితే, అదే ఆయ‌న్ను నాన్ సీరియ‌స్ చేసేసింది. ఈ కామెంట్లు తాజాగా ఆయ‌నే వెల్ల‌డించారు.

గ‌త రెండు మూడు రోజులుగా జ‌గ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేర‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌తో పాటుగా మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని ప‌లు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా, దీనిపై జ‌గ్గారెడ్డి ఆవేద‌నభ‌రితంగా స్పందించారు. గాంధీభవన్లో జగ్గారెడ్డి చిట్ చాట్ చేస్తూ పార్టీ మారుతున్నారనే ప్రచారంపై తాను  ఖండించినా...ఆ ఖండనకు విలువలేకపోయిందని, అందుకే స్పందించట్లేదని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉంటానా, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ‌తానా అనేది కాలమే నిర్ణయిస్తుందంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను టీఆర్ఎస్‌లోకి పోయేందుకు ప్రయత్నించ‌డం లేద‌ని ఆయ‌న ట్విస్ట్ ఇచ్చారు.

హ‌రీష్ రావు మంత్రిగా చేసిన తప్పులనే తాను ఎత్తి చూపుతున్నాన‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. ``సంగారెడ్డి మెడికల్ కాలేజ్, మంజీరా నీటి తరలింపుపైనే హరీష్‌రావుపై  విమర్శలు చేశాను. దానికి కేసీఆర్‌కు కేటీఆర్ కు సంబంధం లేదు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత‌ భట్టి విక్ర‌మార్క‌ ఇద్దరు పార్టీ ఎమ్మెల్యే లకు  పార్టీ మారకుండా ఎమ్మెల్యేలందరికి భరోసా ఇస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే లు ఎందుకు మారారో తెలియదు..పార్టీ మారిన వాళ్లు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్పు. ఎమ్మెల్యేలు పార్టీ  మారినా బలమైన కార్యకర్తలు ఉన్నారు`` అని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు లాంటిద‌ని, పార్టీకి ఢోకా లేద‌న్నారు. ప్రజలు, రైతులకు కష్టాలు ఉన్నన్ని రోజులు రాజకీయ నాయకులకు ఢోకా లేదని జ‌గ్గారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ``వ్యవస్థ అంతా సమస్య ల చుట్టే తిరుగుతుంది..రాజకీయ నాయకులు వాటిని ఎజెండా గా చేసుకొని రాజకీయం చేస్తున్నారు.`` అని వ్యాఖ్యానించారు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English