చిల్ల‌ర కోసం వెళ్లి!... ఏడు ప్రాణాలు పోయాయి!

చిల్ల‌ర కోసం వెళ్లి!... ఏడు ప్రాణాలు పోయాయి!

లౌకిక రాజ్యంగా విల‌సిల్లుతున్న భార‌త దేశంలో... ఎన్నో విశ్వాసాలు, ఎన్నో న‌మ్మ‌కాలు, ఎన్నో మూఢాచారాలు... ఏదైతేనేం... దానిలోని అస‌లు విష‌యాన్ని గ్ర‌హించ‌కుండా ఎగ‌బ‌డిపోవ‌డం ఇప్పుడు మామూలుగానే మారిపోయింది. గ‌తంతో పోలిస్తే వ‌ర్త‌మానంలో, అది కూడా టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత ఈ మూఢ న‌మ్మ‌కాలు మ‌రింత బ‌లీయ‌మ‌య్యాయ‌నే చెప్పాలి.

ఈ ఆచారాల కార‌ణంగా ఒక్కోసారి మంచి జ‌రుగ‌తున్నా.. మ‌రికొన్ని సార్లు ఏకంగా ప్రాణం మీద‌కే వ‌స్తోంది. ఇలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు త‌మిళ‌నాట చోటుచేసుకుంది. త‌మిళ‌నాడులోని తిరుచ్చి స‌మీపంలోని ముత్యంపాళ్యం క‌రుప్పుస్వామి ఆల‌యంలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఏకంగా ఏడు నిండు ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి.

అస‌లు ఈ తొక్కిస‌లాటి ఎందుకు జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... చిల్ల‌ర కోసం ఎగ‌బ‌డ్డ సందర్భంలో ఈ దుర్ఘ‌ట‌న‌ చోటుచేసుకుంద‌ట‌. కురుప్పు స్వామి హుండీలోని చిల్ల‌ర ఉన్న వారికి దైవానుగ్ర‌హం సిద్ధిస్తుంద‌ట‌. ఎప్ప‌టినుంచో ఉన్న ఈ న‌మ్మ‌కానికి అనుగుణంగా ప్ర‌తి ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా చైత్ర‌మాస ఉత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆదివారం కురుప్పు స్వామి హుండీలోని చిల్ల‌ర‌ను భ‌క్తుల‌కు పంచే కార్య‌క్ర‌మం జ‌రిగింది.

అయితే దైవానుగ్ర‌హం సిద్ధిస్తుంద‌న్న భావ‌న‌తో ఆ చిల్ల‌ర కోసం భ‌క్తులు ఎగ‌బ‌డ్డారు. ఇంకేముంది... తొక్కిస‌లాట చోటుచేసుకుంది. ఈ హ‌ఠాత్ప‌రిణామం నుంచి తేరుకునేలోగానే ఏడుగురు విగ‌త జీవులుగా మారారు. మ‌రో ప‌ది మందికి గాయాల‌య్యాయ‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English