మోదీపై పోటీకి ప్రియాంక సై!... రాహుల్ దే ఆల‌స్య‌మ‌ట‌!

మోదీపై పోటీకి ప్రియాంక సై!... రాహుల్ దే ఆల‌స్య‌మ‌ట‌!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వ‌ర్సెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, మ‌రోవైపు ఈ రెంటితో సంబంధం లేని కూట‌ములు మ‌రిన్ని... వెర‌సి ఈ సారి బ‌రి మాత్రం హోరాహోరీగానే ఉందని చెప్ప‌క త‌ప్ప‌దు. నిన్న‌టిదాకా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అమేథీని దాట‌ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ... ఈ ఎన్నిక‌ల్లో ఏకంగా ద‌క్షిణాది నుంచి బ‌రికి సిద్ధ‌మ‌య్యారు. లెఫ్ట్ కోట‌ కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి ఆయ‌న నామినేష‌న్ వేశారు.

అన్న మాదిరే ఈ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటడంతో పాటు పార్టీకి పున‌ర్‌వైభవం తీసుకొచ్చేందుకు ఇప్ప‌టికే రంగంలోకి దిగిపోయిన రాహుల్ గాంధీ సోద‌రి ప్రియాంకా గాంధీ... ఉత్త‌ర‌ప్ర‌దేశ్ తో పాటు వ‌య‌నాడ్ లోనూ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. కేవలం ప్ర‌చార‌మేనా.. పోటీ చేసేదేమైనా ఉందా? అంటే... అంతా హైక‌మాండ్ ఇష్ట‌మేనంటూ నిన్న‌టిదాకా చెప్పుకొచ్చారు. తాజాగా నేటి ప్ర‌చారంలో భాగంగా ఆమె నోట నుంచి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. వార‌ణాసి నుంచి బ‌రిలోకి దిగుతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగానే ఉన్నాన‌ని ఆమె సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

అయితే ఈ విష‌యంలో పార్టీ చీఫ్ గా త‌న సోద‌రుడి మాటే ఫైన‌ల్ అంటూ ఆమె ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చారు. ఇప్పటికే ప్రియాంక పోటీపై ఆమె భ‌ర్త రాబ‌ర్ట్ వాద్రా చాలా ఉబ‌లాట‌ప‌డుతున్నారు. వాద్రా ఉబ‌లాటానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రియాంక నోట కూడా వార‌ణాసిలో అది కూడా మోదీపై పోటీ చేసేందుకు తాను సిద్ధ‌మేన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీ శ్రేణులు కూడా మోదీపై ప్రియాంక పోటీ చేస్తేనే బాగుంటుంద‌ని భావిస్తున్నారు. మ‌రి ఈ పోటీపై రాహుల్ ఏం తేలుస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English