మ‌ళ్లీ తెర‌పైకి కూట‌మి...కేసీఆర్ ఎత్తుల‌కు స్కెచ్‌

మ‌ళ్లీ తెర‌పైకి కూట‌మి...కేసీఆర్ ఎత్తుల‌కు స్కెచ్‌

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు మ‌రోమారు ఐక్య‌త‌రాగం వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు నుంచి గెలిచిన నేతలు టీఆర్‌ఎస్‌లో చేరటం ఆ పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేసిన నేప‌థ్యంలో ఈ ద‌ఫా మ‌రింత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీని ఢీకొనేందుకు అన్ని పార్టీలు ఐక్య కూటమి క‌ట్ట‌నున్నాయి. అధికార పార్టీ అభ్యర్థులకు ఆర్థిక, అంగబలం అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఐక్యంగా ఓకే అభ్యర్థిని పోటీలో పెట్టడం ద్వారా సులభంగా విజయం సాధించవచ్చునని భావిస్తున్నాయి.

అధికార టీఆర్ఎస్ పార్టీ స‌హ‌జంగానే ప్ర‌లోభాలు పెట్టే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్న తెలుగుదేశం, కాంగ్రెస్ నేత‌లు కూట‌మి క‌ట్ట‌క‌పోతే ఓట్లు చీలిపోవ‌డమే కాకుండా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధించ‌లేమ‌ని అంచ‌నా వేస్తున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల రాష్ట్ర నాయకత్వం ఈ మేర‌కు ఇప్ప‌టికే చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. దీంతోపాటుగా రాష్ట్ర స్థాయిలో వామపక్షాలతో కూడా చర్చలు జరిపి ఒప్పించగలిగితే ఎక్కువ జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవచ్చునని అంచనాలు వేస్తున్నారు. ఈ నాలుగు పార్టీల‌కు తోడుగా, కోదండ‌రాం సార‌థ్యంలోని తెలంగాణ జ‌న‌స‌మితిని క‌లుపుకొని టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టాల‌ని భావిస్తున్నాయి.

ఇప్ప‌టికే అధికార పార్టీ టీఆర్‌ఎస్ నేతలు ఆయా స్థానాలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపుఎంపీటీసీ, జడ్పీటీసీలకు నోటిఫికేషన్ రావ‌డంతో త్వరితగతిన ఐక్య కూటమిపై నిర్ణయం తీసుకోవాలని ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయా పార్టీల నేత‌లు స‌మావేశ‌మై  కూట‌మి నిర్ణ‌యంపై ఓ స్ప‌ష్ట‌త‌కు రానున్న‌ట్లు స‌మాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English