పేలుళ్ల నుంచి తృటిలో త‌ప్పించుకున్న సీనియ‌ర్ న‌టి

పేలుళ్ల నుంచి తృటిలో త‌ప్పించుకున్న సీనియ‌ర్ న‌టి

శ్రీ‌లంక రాజ‌ధాని కొలంబోలో జ‌రిగిన వ‌రుస బాంబుపేలుళ్ల నుంచి సీనియ‌ర్ సినీ న‌టి రాధిక తృటిలో త‌ప్పించుకున్నారు. తాజాగా ఆ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించారు. బాంబుపేలుళ్ల‌కు కొద్ది నిమిషాల ముందే హోట‌ల్ నుంచి తాము బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా ఆమె పేర్కొన్నారు.

కొలంబోలో అతి పెద్ద హోట‌ల్ల‌లో సిన‌మ‌న్ గ్రాండ్ హోట‌ల్ ఒక‌టి. ఇదెంత పెద్ద హోట‌ల్ అంటే.. దేశంలో ఎల్టీటీఈతో అంతర్థ్యం జ‌రిగే స‌మ‌యంలో.. క‌ర్ఫ్యూలో ఉన్నా.. ఈ హోట‌ల్ కు చెందిన కార్ల‌కు ప్ర‌త్యేక ప‌ర్మిష‌న్లు ఉండేవి. ఈ హోట‌ల్లో బ‌స చేసే అతిధుల‌కు స్వ‌ల్ప త‌నిఖీల‌తో స‌రి పుచ్చేవారు. విదేశీ ప్ర‌ముఖులతో పాటు సెల‌బ్రిటీలు ఎవ‌రొచ్చినా ఈ హోట‌ల్లోనే బ‌స చేస్తుంటారు.

కొలంబోలో ఫేమ‌స్ ఫైర్ స్టార్ హోట‌ల్లో ఇదొక‌టి. ఇక్క‌డ బాంబు పేల‌టానికి కొన్ని నిమిషాల ముందే ఆమె హోట‌ల్ ను ఖాళీ చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీనిపై ట్విట్ట‌ర్ లో స్పందించిన రాధిక‌.. పేలుళ్ల గురించి విని తాను షాక్ కు గుర‌య్యాన‌ని.. దేవుడు త‌మ‌తో ఉన్న‌ట్లుగా పేర్కొన్నారు. హోట‌ల్లో పేలుళ్లు జ‌రిగిన విష‌యాన్ని తాను ఇప్ప‌టికి న‌మ్మ‌లేక‌పోతున్న‌ట్లుగా ట్వీట్ చేశారు.   

ఇదిలా ఉండ‌గా.. వ‌రుస బాంబు దాడుల‌తో అలెర్ట్ అయిన ప్ర‌భుత్వం త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. ప్ర‌స్తుతం మొబైల్ సేవ‌ల్ని నిలిపివేశారు. ఆర్మీకి చెందిన 200ట్రూపుల‌ను దేశ వ్యాప్తంగా మొహ‌రించారు. అత్య‌వ‌స‌ర సేవ‌ల రంగాన్ని దింపారు. పేలుళ్లు జ‌రిగిన ప్రాంతాల్లో సాధార‌ణ ప‌రిస్థితి నెల‌కొనేందుకు స్థానిక భ‌ద్ర‌తా సిబ్బంది సేవ‌లు అందిస్తున్నారు. సెక్యురిటీ విభాగం సెలవుల్ని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

మ‌రోవైపు కొంలంబోలోని బండార‌నాయ‌కే అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం వ‌ద్ద భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. శ్రీ‌లంక జాతీయ విమాన‌యాన సంస్థ శ్రీ‌లంక‌న్ ఎయిర్ లైన్స్ ఇప్ప‌టికే త‌న ప్ర‌యాణికుల్ని అలెర్ట్ చేసింది. నిర్ణీత ప్ర‌యాణ స‌మ‌యానికి నాలుగు గంట‌ల ముందు ఎయిర్ పోర్ట్ కు చేరుకోవాల‌ని పేర్కొంది. దేశ వ్యాప్తంగా సోమ‌.. మంగ‌ళ‌వారాల్లో స్కూళ్ల‌కు సెల‌వుల్ని ప్ర‌క‌టిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English