మోడీ వెబ్ సిరీస్ కు ఈసీ పంచ్!

మోడీ వెబ్ సిరీస్ కు ఈసీ పంచ్!

కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. త‌మ గొప్ప‌త‌నం గురించి.. తాము వినిపించే వాద‌న గొప్ప‌త‌నం మీదా సినిమాలు.. వెబ్ సిరీస్ లు విడుద‌ల చేసే కొత్త త‌ర‌హా ఆలోచ‌న‌ల్ని షురూ చేయ‌టంలో బీజేపీని మెచ్చుకోవాలి. ఆ పార్టీ వ్యూహాల్ని చూస్తే ముచ్చ‌ట‌ప‌డాల్సిందే. త‌మ బ‌ల‌మంతా మోడీతోనే ఉండ‌టం.. ఆయ‌న్ను ప్ర‌మోట్ చేసేందుకు ఉన్న ఏ చిన్న మార్గాన్ని వ‌ద‌ల‌కుండా.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌కు ఆయ‌న‌లోని గొప్ప‌త‌నాన్ని కొత్త త‌ర‌హాలో చూపించే ప్ర‌య‌త్నం జోరుగా సాగుతోంది.

ఇందులో భాగంగా ఇప్ప‌టికే మోడీ బ‌యోపిక్ ను తెర మీద తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా.. ఈసీ వేసిన వేటుతో ఆ సినిమా విడుద‌ల ఆగింది. ఓవైపు బ‌యోపిక్.. మ‌రోవైపు వెబ్ సిరీస్ ను ప్లాన్ చూసిన తీరుకు ఎవ‌రైనా ముగ్దుల‌వ్వాల్సిందే. మోడీ బ‌యోపిక్ విష‌యంలో ఈసీ ఏ తీరులో అయితే నిర్ణ‌యాన్ని తీసుకుందో.. అదే తీరుతో వెబ్ సిరీస్ విష‌యంలోనూ నిర్ణ‌యం తీసుకోవాలంటూ ఫిర్యాదుదారు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో మోడీ జ‌ర్నీ ఆఫ్ ఏ కామ‌న్ మ్యాన్ పేరుతో ఉన్న వెబ్ సిరీస్ ను వెంట‌నే నిలిపివేయాలంటూ ఈసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్త‌ర్వుల్ని విడుద‌ల చేసింది. మోడీ వెబ్ సిరీస్ ను ప్ర‌ముఖ ఛాన‌ల్ ఎరోస్ నౌ ఇప్ప‌టికే ఐదు ఎపిసోడ్ల‌ను విడుద‌ల చేసింది. తాజాగా ఈసీ విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల‌లో.. స‌ద‌రు వెబ్ సిరీస్ కు సంబంధించిన మొత్తం కంటెంట్ ను ఎరోస్ నౌ ప్లాట్ ఫాం మీద నుంచి తొల‌గించాల‌ని పేర్కొంది.

మోడీ బ‌యోపిక్ పై ఈసీ త‌న అభిప్రాయాన్ని సోమ‌వారం వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌న్న వేళ‌.. వెబ్ సిరీస్ పై కొత్త ఉత్త‌ర్వులు జారీ చేయ‌టం చూస్తే..క‌మ‌ల‌నాథుల‌కు మింగుడుప‌డ‌ని రీతిలో తాజా ఉత్త‌ర్వు ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English