ఇంకో ముగ్గురు జంప్‌...కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష హోదా గాయ‌బ్‌

ఇంకో ముగ్గురు జంప్‌...కాంగ్రెస్ ప్ర‌తిప‌క్ష హోదా గాయ‌బ్‌

తెలంగాణ కాంగ్రెస్‌కు షాకుల ప‌రంప‌ర కొనసాగ‌డం ఖాయ‌మ‌ని తేలింది. ఇప్ప‌టికే ప‌దిమంది ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్‌భై చెప్ప‌గా మ‌రికొంద‌రు ఆ జాబితాలో ఉన్నారు. అయితే ఈ జంపింగ్ ప‌రంప‌ర‌తో సంచ‌ల‌న ప‌రిణామాలు చోటుచేసుకోనున్నాయి. కాంగ్రెస్ నాయకత్వంపై విశ్వాసం లేదంటూ, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమ‌ని పేర్కొంటూ  ఆ పార్టీ ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరడం ద్వారా ఆ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా గాయ‌బ్ కానుంది.

ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 స్థానాలను కైవసం చేసుకుంది. ఎన్నికల అనంతరం ఇండిపెండెంట్లుగా గెలిచిన కోరుకంటి చందర్, రాములునాయక్ టీఆర్ఎస్‌లో చేరారు. టీడీపీకి చెందిన సండ్ర వెంకటవీరయ్య గులాబీ పార్టీలో చేరనున్న‌ట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ప‌ది మంది టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు వెల్ల‌డించారు. ఈ చేరిక‌తో ఎమ్మెల్యేల సంఖ్య వంద‌కు చేరింది. ఈ షాకుల ప‌రంప‌ర‌ను మ‌రింత కొన‌సాగించ‌డంలో భాగంగా, సీఎల్పీని విలీనం చేసేందుకు కేసీఆర్ న‌డుం భిగించారు. తాజాగా మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేల‌ను త‌మ గూటికి లాగేస్తున్నారు.

మీడియా స‌హా సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం, మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు కారు గూటికి చేర‌నున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఈ జాబితాలో ఉన్నారు. ఈ చేరిక‌తో శాసనసభలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోనుంది. జూన్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనుండ‌గా ఈ సమావేశాల్లో సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసేందుకు  కేసీఆర్ త‌గు ప్ర‌క్రియ పూర్తి చేయ‌నున్నార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఈ ముగ్గురు పార్టీ మారితే కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన వారి సంఖ్య 13కు చేర‌నుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English