ఒంటిమిట్ట‌లో శ్రీ‌లక్ష్మీ!... ఇక ఇబ్బంది లేద‌బ్బా!

ఒంటిమిట్ట‌లో శ్రీ‌లక్ష్మీ!... ఇక ఇబ్బంది లేద‌బ్బా!

ఐఏఎస్ అధికారిణి శ్రీ‌ల‌క్ష్మీ గుర్తున్నారా?  తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సీఎంగా ఉండ‌గా... క‌ర్ణాట‌క మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి అక్ర‌మంగా గ‌నుల‌ను కేటాయించార‌న్న కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డంతో పాటుగా ఏకంగా జైలుకు కూడా వెళ్లిన ఐఏఎస్ అధికారిణి ఆమె. విధి నిర్వ‌హ‌ణ‌లో స‌మ‌ర్ధ‌వంత‌మైన ఆఫీస‌ర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ‌ల‌క్ష్మీ... అప్ప‌టిదాకా సింగిల్ ఆరోప‌ణ లేకుండానే నెట్టుకొచ్చారు.

అయితే వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, అదే స‌మ‌యంలో గ‌నుల అక్ర‌మ కేటాయింపుల కేసుల ద‌ర్యాప్తులో శ్రీ‌ల‌క్ష్మీపై అవినీతి మ‌ర‌క అంటింది. ఏకంగా జైలుకు వెళ్ల‌డంతో తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గురైన శ్రీ‌ల‌క్ష్మీ... తీవ్ర అనారోగ్యం పాల‌య్యారు. ఓ వైపు కేసు ద‌ర్యాప్తు సాగుతుండ‌గానే... చాలా కాలం త‌ర్వాత బెయిల్ రావ‌డంతో జైలు నుంచి విడుద‌లవుతున్న సంద‌ర్భంగా శ్రీ‌ల‌క్ష్మీని చూసిన వారంతా షాక్‌కు గుర‌య్యారు. న‌డ‌వ‌లేని ప‌రిస్థితిలో ఐపీఎస్ అధికారి అయిన భ‌ర్త సాయంతో బ‌య‌ట‌కు వ‌చ్చిన శ్రీ‌ల‌క్ష్మీ అస‌లు ఇక సాధార‌ణ ప‌రిస్థితికి రాగ‌ల‌రా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. చ‌లాకీగా, చాలా చురుగ్గా క‌నిపించిన శ్రీ‌ల‌క్ష్మీ ఇలా త‌యారయ్యారేంట‌బ్బా అంటూ చాలా మంది ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆ త‌ర్వాత చికిత్స తీసుకుంటున్న క్ర‌మంలోనే తెలంగాణ కేడ‌ర్ కు వెళ్లిపోయిన శ్రీ‌లక్ష్మీకి కేసీఆర్ స‌ర్కారు పోస్టింగ్ కూడా ఇచ్చింది. ఆ త‌ర్వాత కూడా ఎక్క‌డ క‌నిపించ‌ని శ్రీ‌ల‌క్ష్మీ... నిన్న క‌డ‌ప జిల్లా ఒంటిమిట్ట కోదండ‌రామాల‌యంలో జ‌రిగిన న‌వ‌మి వేడుక‌ల్లో క‌నిపించారు. అనారోగ్యాన్ని జ‌యించి పూర్తి ఆరోగ్యంతో క‌నిపించిన శ్రీ‌ల‌క్ష్మీ... కోదండ‌రాముడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అక్క‌డ శ్రీ‌ల‌క్ష్మీని చూసిన వారంతా... ఇక ఆమెకు ఏ ఇబ్బందీ లేద‌ని, మామూలు మ‌నిషి అయిపోయార‌న్న వాద‌న వినిపించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English