తెలుగు మీడియాకు డ్రై డేస్!

తెలుగు మీడియాకు డ్రై డేస్!

తెలుగు నేల‌లో ఇప్పుడు విచిత్ర‌మైన ప‌రిస్థితి. మొన్న‌టిదాకా క‌నిపించిన ఎన్నిక‌ల కోలాహ‌లం ముగిసిపోయింది. ఎన్నిక‌లకు ముందు ఎక్క‌డేం జ‌రుగుతుందా? అంటూ పొద్దున్నే లేవ‌గానే పేప‌ర్లు ముందేసుకుని కూర్చునేవాళ్లు తెలుగు ప్ర‌జ‌లు. ఇప్పుడు అస‌లు ఆ పేప‌ర్ల‌ను ముందేసుకుని క‌నిపించే వారే లేరు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి ఇంత‌కు ముందెన్న‌డూ లేద‌నే చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక అంశంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రిగేవి.

రాజ‌కీయంగా అయితే ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు... వేడి పుట్టించే లైవ్ డీబేట్లు... ఇలా పొద్దున లేచిన‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునే దాకా హ‌డావిడే. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఆ ప‌రిస్థితి ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. తెలుగు మీడియాకు అయితే నిజంగానే డ్రై డేసేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. రాజ‌కీయ వార్త‌లు లేవు.

అలాగ‌ని ఏదేని ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల మీద స‌మీక్ష‌లు రాసే వీలూ లేదు. అలాంటి వార్త‌లు రాద్దామ‌న్నా... స‌మాచారం ప‌క్కాగా ల‌భించే అవ‌కాశాలు చాలా త‌క్కువేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... వ‌చ్చే నెల 23న వెలువ‌డే ఫ‌లితాలు త‌ప్పించి తెలుగు ప్ర‌జ‌ల‌కు ఇంకేమీ ఆసక్తి రేకెత్తించే అవ‌కాశ‌మే లేదు. తెలంగాణ‌లో అయితే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కార‌ణంగా ఓ మోస్త‌రు వార్త‌లు ఉన్నా.. ఏపీలో అది కూడా లేదు. ఎందుకంటే... ఏపీలో ఇప్పుడున్న‌ది ఆప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వం క‌దా. స‌మీక్ష‌లు లేవు. చ‌ర్చ‌లు లేవు. మొత్తంగా ఈ 40 రోజులు తెలుగు మీడియాకు డ్రై డేస్‌గా మారిపోతే... తెలుగు ప్ర‌జ‌ల‌కు మాత్రం భారంగా న‌డిచే రోజుల కిందే లెక్క‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English