బాబు బ‌ర్త్ డే!... మోదీ, జ‌గ‌న్ గ్రీటింగ్స్ చెప్పేశారు!

బాబు బ‌ర్త్ డే!...  మోదీ, జ‌గ‌న్ గ్రీటింగ్స్ చెప్పేశారు!

టీడీపీ అధినేత‌, ఏపీ ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు 70 వ‌సంతంలోకి అడుగుపెట్టారు. నేడు ఆయ‌న త‌న 69వ జన్మ‌దినాన్ని జ‌రుపుకుంటున్నారు. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి మండ‌లం నారావారిపల్లెలో ఖ‌ర్జూర‌నాయుడు, అమ్మ‌ణ్ణ‌మ్మ దంప‌తుల‌కు జ‌న్మించిన చంద్ర‌బాబు... త‌న విద్యాభ్యాసాన్ని సొంత జిల్లాలోనే పూర్తి చేశారు. త‌న సొంతూరికి కూత‌వేటు దూరంలో ఉన్న తిరుప‌తిలోని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యంలో మాస్ట‌ర్స్ డిగ్రీని పూర్తి చేసిన చంద్ర‌బాబు... అప్పుడే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

విద్యార్థి ద‌శ‌లోనూ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి క‌న‌బ‌ర‌చిన చంద్ర‌బాబు... 1978లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌గిరి నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన చంద్రబాబు... తొలిసారే ఎమ్మెల్యేగా గెలుపొంద‌డంతో పాటుగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన‌ప్పుడే మంత్రి ప‌ద‌వినీ ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత భువ‌నేశ్వ‌రితో వివాహం త‌ర్వాత స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరిపోయిన చంద్ర‌బాబు... త‌న‌దంత‌ర కాలంలో ఎన్టీఆర్ చేతిలో నుంచి పార్టీని ప్ర‌భుత్వాన్ని లాగేసుకున్నారు. ఆ త‌ర్వాత ఉమ్మ‌డి రాష్ట్రానికి తొమ్మిదిన్న‌రేళ్ల పాటు సీఎంగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు... దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భంజ‌నంతో ప‌దేళ్ల పాటు విప‌క్ష నేత‌గానూ కొన‌సాగారు. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మ‌రోమారు సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన చంద్ర‌బాబు... ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో పార్టీని సింగిల్ హ్యాండ్ మీదే న‌డిపించేశారు.

బాబు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ప‌లువురు ప్ర‌ముఖుల నుంచి ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ త‌ర‌హా గ్రీటింగ్స్ లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్విట్ట‌ర్ ద్వారా చంద్ర‌బాబుకు గ్రీటింగ్స్ చెప్పారు. హృద‌య‌పూర్వ‌క జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చంద్ర‌బాబు గారూ... అంటూ జ‌గ‌న్ త‌న గ్రీటింగ్స్ ను నేటి ఉద‌య‌మే పోస్ట్ చేశారు. ఇక చంద్ర‌బాబు నిత్యం ఫైరేపోతున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఆయ‌న‌కు బ‌ర్త్ డే గ్రీటింగ్స్ తెలిపారు. పార్టీ నేత‌లు పెద్ద ఎత్తున చంద్ర‌బాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. మొత్తంగా పార్టీలో బాబు బ‌ర్త్ డే కోలాహ‌లం నెల‌కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English