గాలిలో పునేఠా!.. ఏబీదీ సేమ్ సీన్‌!

గాలిలో పునేఠా!.. ఏబీదీ సేమ్ సీన్‌!

ఏపీలో ఈ నెల 11న జ‌రిగిన ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ కు కొద్ది రోజుల ముందుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం కీల‌క నిర్ణ‌యాల‌ను తీసుకుంది. వాటిలో ఒక‌టి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును ఆ ప‌ద‌వి నుంచి  తొల‌గించిన ఈసీ... పోలింగ్  ద‌గ్గ‌ర‌ప‌డిన నేప‌థ్యంలో ఏపీ సీఎస్‌గా ఉన్న సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠాను కూడా ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించింది. దీంతో ఈ ఇద్ద‌రు అధికారులు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు దూరంగా ఉండిపోవాల్సి వ‌చ్చింది.

స‌రే... ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్ ముగిసింది క‌దా. మ‌రి వీరిద్ద‌రూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎలాంటి బాధ్య‌త‌ల్లో ఉన్నారు? అస‌లు వీరు ఆఫీసుకు వ‌స్తున్నారా? అన్న ప్ర‌శ్న‌లు ఆస‌క్తి రేకెత్తించేవే క‌దా. ఏబీని బ‌దిలీ చేసిన సంద‌ర్భంగా ఆయ‌న‌ను రాష్ట్ర పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న డీజీపీ కార్యాల‌యంలో రిపోర్ట్ చేసి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక సీఎస్ గా ఉన్న పునేఠాను బ‌దిలీ చేసిన ఈసీ... ఆయ‌న‌ను జీఏడీకి రిపోర్ట్ చేయాల‌న్న ఆదేశాలు అయితే ఇవ్వ‌లేదు. సీఎస్ పోస్ట్ నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు పేర్కొన్న ఈసీ... ఆయ‌న భ‌విష్య‌త్తు పోస్టింగ్ ల‌పై మాత్రం ప్ర‌స్తావించ‌లేదు.

అప్ప‌టిదాకా తాను కూర్చున్న సీఎస్ సీట్లో ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం కూర్చుని ఉన్నారు. పునేఠాకు మ‌రో పోస్టింగేమీ ఇవ్వ‌లేదు. దీంతో పునేఠా ఇప్పుడు ఎక్క‌డికి వెళ్లాలో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. మొత్తంగా ఆయ‌న ప‌రిస్థితి గాల్లో ఉన్న‌ట్లుగానే లెక్క‌. ఇక డీజీపీ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయ‌మ‌ని చెప్పిన ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు కూడా ఇప్పుడ‌ప్పుడే పోస్టింగ్ ద‌క్కే ప‌రిస్థితి లేదు. దీంతో ఆఫీసుకు వెళ్లేందుకు ఏబీకి అవ‌కాశం ఉన్నా... ప్ర‌త్యేక‌మైన పోస్టింగ్ అంటూ ఏదీ లేక‌పోవ‌డంతో ఆయ‌న కూడా పునేఠా మారిదే గాల్లో ఉన్న‌ట్లుగానే లెక్క‌. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డి... కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరేదాకా వీరిద్ద‌రి ప‌రిస్థితి ఇంతేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English