కేసీఆర్‌కు గుడి క‌ట్టిస్తా...కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌నం

కేసీఆర్‌కు గుడి క‌ట్టిస్తా...కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌నం

గ‌త కొద్దికాలంగా సొంత పార్టీపై విమ‌ర్శ‌లు, ప్ర‌త్య‌ర్థి పార్టీపై పార్టీపై ప్ర‌శంస‌ల‌తో స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి తాజాగా ఆస‌క్తిక‌ర‌మైన ఎపిసోడ్‌తో ముందుకు వ‌చ్చారు. ఢిల్లీ రాజ్యం న‌డుస్తోంద‌ని, సొంత పార్టీలో కొంద‌రిదే పెత్త‌న‌మ‌ని వ్యాఖ్యానించ‌డం ద్వారా అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకొన్న జ‌గ్గారెడ్డి తాజాగా అంత‌కంటే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేసీఆర్‌కు గుడి క‌ట్టిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

హైదరాబాద్ గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన జగ్గారెడ్డి రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయడం దారుణమన్నారు. అవినీతి లేని శాఖ ఉంటుందా? అవినీతి చేయని నాయకుడుంటారా? అని జగ్గారెడ్డి అన్నారు. నల్గొండ, ఖమ్మం, మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగానే కేసీఆర్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తానన్న కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాన‌ని జగ్గారెడ్డి ప్ర‌క‌టించారు. అయితే ఏడాదిలోగా పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తే.. కేసీఆర్ కు సంగారెడ్డిలో గుడి కట్టిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా గుడి కట్టిస్తానన్నారు.

కాగా, కొద్దికాలం నుంచి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో జ‌గ్గారెడ్డి వార్త‌ల్లో నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ వల్ల తనకు, తన కుటుంబానికి మంచే జరిగిందని, ఎమ్మెల్యేగా చట్టసభలోకి ప్రవేశించానని ప్ర‌క‌టించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో త‌న‌కు విబేధాలు లేవ‌ని...తాను విభేదించేదంతా హరీశ్‌రావుతోనేనని, హరీశ్‌తో పోలిస్తే కేటీఆర్‌ చాలా ఫెయిర్‌ అని వ్యాఖ్యానించారు. ఇలా ప్ర‌క‌టించిన జ‌గ్గారెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకున్నార‌ని ప్ర‌చారం జరిగింది. త్వ‌ర‌లో చేర‌బోయే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయ‌ననే జోస్యం వెలువ‌డింది. అయితే, జ‌గ్గారెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English