కమల్ ప్రభావం ఏమీ ఉండదా?

కమల్ ప్రభావం ఏమీ ఉండదా?

తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్‌ల రాజకీయారంగేట్రం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఐతే ఏళ్లకు ఏళ్లు ఎటూ తేల్చకుండా ఉండిపోయిన వీళ్లిద్దరూ.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత కానీ ధైర్యం చేయలేకపోయారు. ఒకరి తర్వాత ఒకరు తమ రాజకీయారంగేట్రాన్ని ప్రకటించారు. వీరిలో కమల్ పార్టీని ప్రకటించి అంతో ఇంతో రాజకీయ కార్యాచరణ చేపట్టాడు కానీ.. రజనీ అయితే కేవలం రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించి ఊరుకున్నాడంతే. ఆయన ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలకు కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కమల్ కూడా ఒక దశలో ఈ ఎన్నికల్లో తన పార్టీని బరిలోకి దించే ఉద్దేశం లేనట్లే కనిపించాడు. కానీ తర్వాత మనసు మార్చుకున్నాడు. ఐతే ఆయన పోటీ చేయకుండా అభ్యర్థుల్ని మాత్రమే బరిలోకి దించాడు.

కొంచెం లేటుగా పార్టీని రేసులోకి తీసుకొచ్చిన కమల్.. పార్టీ తరఫున అభ్యర్థుల్ని నిలబెట్టి వారికి మద్దతుగా ప్రచారం కూడా చేశాడు. కానీ ఎన్నికల్లో కమల్ పార్టీ ప్రభావం అంతంతమాత్రమే అని అక్కడి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో డీఎంకే పార్టీ హవా ఉండబోతోందని.. జయ మరణానంతరం అన్నాడీఎంకే పార్టీపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి మాత్రమే కమల్ పార్టీ ఉపయోగపడుతుందని.. తద్వారా డీఎంకేకే మేలు చేయబోతోందని అంటున్నారు. కమల్ మరీ లేటుగా రంగంలోకి దిగడం.. పార్టీ నిర్మాణమే జరగకకపోవడం వల్ల క్యాడర్ లేకపోవడం.. అంత ఉత్సాహంగా ప్రచారం చేయకపోవడం.. అభ్యర్థులందరూ కొత్త వాళ్లు కావడం ప్రతికూలమయ్యాయని.. కాబట్టి ఆ పార్టీ ప్రభావం నామమాత్రమే అని అంటున్నారు. డిపాజిట్లు వస్తేనే గొప్ప అని.. విజయానికి అవకాశమే లేదని విశ్లేషకులు తేల్చేస్తున్నారు. రజనీ ఈ పరిస్థితిని అంచనా వేసే పోటీకి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఐతే కమల్‌, రజనీలిద్దరి టార్గెట్ ముఖ్యమంత్రి పదవే కావడంతో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల మీద వారి ఫోకస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే అప్పటికైనా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగి, క్యాడర్ పెంచుకోకుంటే వీరి పార్టీల ప్రభావం అంతంతమాత్రమే అవుతుందని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English