కేసీఆర్‌, జ‌గ‌న్ ఏంచెప్తే..అదే చేస్తానంటున్న ఓవైసీ

కేసీఆర్‌, జ‌గ‌న్ ఏంచెప్తే..అదే చేస్తానంటున్న ఓవైసీ

పాత‌బ‌స్తీకి చెందిన‌ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ త‌నకు తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు, ఏపీ ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి ప‌ట్ల త‌న మ‌మ‌కారాన్ని చాటుకుంటున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ ఇద్ద‌రు నేత‌ల‌తో త‌న‌కున్న స‌ఖ్య‌త విష‌యంలో నిర్మోహ‌మాటంగా బ‌హిరంగ క్లారిటీ ఇస్తున్న ఈ ఓల్డ్ సిటీ నాయ‌కుడు తాజా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ విపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ ఎంత చెప్తు అంతే తాను ఫాలో అవుతాన‌ని వెల్ల‌డించారు. ప్ర‌ధాని ప‌ద‌విని మోదీ చేప‌ట్ట‌కుండా ఉండేందుకు క‌లిసిక‌ట్టుగా కృషి చేస్తామ‌న్నారు.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ఓవైసీ మాట్లాడుతూ...ఈసారి ప్రధానిగా మోదీ ఎన్నికయ్యే అవకాశం లేదని తెలిపారు. అటువంటి పరిస్థితిని తాము రానీయబోమన్నారు. భారత ప్రధానిగా మళ్లీ నరేంద్రమోదీ గద్దెనెక్కకుండా చేస్తామని  చెప్పారు. తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు, ఏపీ ప్రతిపక్షనేత జగన్‌మోహన్‌రెడ్డి, ప్రకాశ్ అంబేద్కర్ సూచించిన వ్యక్తి మాత్రమే ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. తమ పార్టీ మహారాష్ట్రలో ప్రకాశ్ అంబేద్కర్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నదన్నారు.

తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా తొలిదశ పోలింగ్‌లో ప్రాంతీయ పార్టీల హవా నడిచిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేశంలో బీజేపీ గాలి ఎక్కడా లేదని, కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చే సత్తాలేదన్నారు. ఊహించినట్టే థర్డ్ ఫ్రంట్ వైపు జనం మొగ్గుచూపారన్నారు. తెలంగాణ, ఏపీ తరహాలోనే బీహార్, మహారాష్ట్రలో ఫలితాలు వెలువడుతాయని జోస్యం చెప్పారు. తమకు కాంగ్రెస్, బీజేపీతో కలువాల్సిన అవసరం లేదని, ప్రాంతీయ పార్టీలకే తమ మద్దతని స్పష్టంచేశారు. కాగా, ఈ స్థాయిలో కేసీఆర్‌, జ‌గ‌న్ మాట‌ల‌కు ఓవైసీ విలువ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English