మోడీ సైతం కంగుతినేలా న‌వీన్ షాకిచ్చారా?

మోడీ సైతం కంగుతినేలా న‌వీన్ షాకిచ్చారా?

ఎవ‌డ్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దన్న మాట‌ను కొంద‌రు చెబుతుంటారు. అయితే.. ఆ విష‌యాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. కొన్ని సంద‌ర్భాల్లో అలా చేసి.. అందుకు ఫ‌లితం అనుభ‌వించిన‌ప్పుడు మాత్రం.. త‌త్త్వం బోధ ప‌డుతుంది. ఇవాల్టి రోజున ప్ర‌ధాని మోడీని నిలువ‌రించే శ‌క్తి.. దేశంలో ఏ ఒక్క రాజ‌కీయ నేత‌కు లేద‌న్న‌ది నిజం. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల సమ‌యంలో ఆయ‌న ప్ర‌ధాని కావాలంటూ వీచిన గాలికి నేటికి పొంత‌న లేకున్నా.. ఆయ‌న్ను ఢీ కొట్టే ద‌మ్మున్నోడు ఇప్ప‌టివ‌ర‌కూ తెర మీద‌కు రాలేద‌ని చెప్పాలి.

కొద్దిమంది మోడీని రాజ‌కీయంగా ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేస్తున్నా.. వారెవ‌రూ ఆయ‌న‌కు స‌రైన ప్ర‌త్య‌ర్థి ఎంత‌మాత్రం కాద‌న్న‌ది వాస్త‌వం. ఇదిలా ఉండ‌గా.. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రులు ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ల‌ను త‌నికీ చేస్తున్నారు. నిన్న‌టికి నిన్న (సోమ‌వారం) ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ మెడిసిన్ బాక్స్ ను కూడా చెక్ చేయ‌టం సంచ‌ల‌నం సృష్టించింది.

అయితే.. మిగిలిన నేత‌ల మాదిరి న‌వీన్ రియాక్ట్ అయ్యే ర‌కం కాదు. ఆయ‌నేం చేయాల‌నుకున్నా.. సాఫ్ట్ గా.. స్మూత్ గా ప‌ని చేస్తారే కానీ.. అన‌వ‌స‌ర‌మైన ర‌చ్చ చేయ‌టం క‌నిపించదు. ఈ కార‌ణంగానే గ‌డిచిన 19 ఏళ్లుగా ఆయ‌న ఒడిశా సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా మ‌రోసారి అధికారాన్ని సొంతం చేసుకోవ‌టానికి ఎన్నిక‌ల బ‌రిలో దిగారు.

ఒక పెద్ద రాష్ట్రానికి సీఎంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. రాజ‌కీయంగా మ‌చ్చ‌లు పెద్ద‌గా లేని న‌వీన్ లాంటి నేత హెలికాఫ్ట‌ర్ ను ఎన్నిక‌ల సంఘం అధికారులు త‌నిఖీ చేశారు. వారి సోదాల‌కు ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌కుండా న‌వీన్ మౌనంగా ఉండిపోయారు.

ఈ సీన్ ఇక్క‌డ క‌ట్ చేస్తే.. ఒడిశాలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి వ‌చ్చారు ప్ర‌ధాని మోడీ. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ ను త‌నిఖీ చేసేందుకు ఐఏఎస్ అధికారి ఒక‌రు రావ‌టం.. సోదాలు చేసే ప్ర‌య‌త్నం చేయ‌టం ఒక్క‌సారి షాకింగ్ గా మారింది. దేశ ప్ర‌ధాని ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ ను త‌నిఖీ చేసే సాహ‌సం చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై పీఎంవో ఈసీకి ఫిర్యాదు చేయ‌టం.. ఆ వెంట‌నే రియాక్ట్ అయి.. స‌ద‌రు అధికారిపై స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌టం లాంటివి జ‌రిగినా.. సోదాల వ్య‌వ‌హారం షాకింగ్ మారింద‌నే చెప్పాలి.

ఈ విష‌యానికి న‌వీన్ ప‌ట్నాయ‌క్ కు సంబంధం లేద‌ని ఎంత చెప్పినా.. ఒకే రోజు.. కాస్త తేడాతో ఒడిశా సీఎం త‌నిఖీలు జ‌ర‌గ‌టం.. దేశ ప్ర‌ధాని ప్ర‌యాణిస్తున్న వాహ‌నం త‌నికీలు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. త‌ర్వాతేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. త‌నిఖీల టేస్ట్ ఎలా ఉంటుందో ప్ర‌ధాని మోడీకి అనుభ‌వంలోకి రావ‌టం గ‌మ‌నార్హం. ఇందులో న‌వీన్ హ‌స్తం లేద‌న్న మాట వినిపిస్తున్నా.. సాఫ్ట్ గా ఉంటూ మోడీ మాష్టారికే భ‌లేగా షాక్ ఇచ్చారే.. అన్న కామెంట్లు వినిపిస్తుండ‌టం గ‌మనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English