‘లీడర్’ సినిమాలా అయిందంటే జగన్ పరిస్థితేంటి?

‘లీడర్’ సినిమాలా అయిందంటే జగన్ పరిస్థితేంటి?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోందట.. కనీసం 120 సీట్లు గ్యారెంటీ అట.. జగన్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించబోతుండటం లాంఛనమేనట. ఎన్నికల ముందు, తర్వాత ఇలాగే హోరెత్తించేస్తున్నారు ఆ పార్టీ మద్దతుదారులు. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. భారీ మెజారిటీతో వైకాపా అభ్యర్థి గెలుస్తాడన్నరు. చివరికేమో టీడీపీనే జయకేతనం ఎగురవేసింది. జగన్ ఏరి కోరి నియమించుకున్న ప్రశాంత్ కిషోర్ టీం పార్టీకి ఒక కృత్రిమమైన హైప్ క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్న సంగతి చాలామందికి తెలియదు. సోషల్ మీడియాతో పాటు బయట కూడా వైకాపా వేవ్ ఉన్నట్లుగా గట్టి ప్రచారం చేస్తోందీ బృందం.

ఐతే ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రచారం ద్వారా జనాల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్నికలయ్యాక కూడా ఇలాంటి ప్రచారాలే కొనసాగుతున్నాయి. జగన్ ఆల్రెడీ సీఎం అయిపోయినట్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేయడం విడ్డూరం. 2024లో కూడా ఇలాగే గెలవాలని జగన్ అనడం షాకింగే. మరోవైపు ముఖ్యమంత్రిగా జగన్ నేమ్ బోర్డు కూడా తయారైపోయినట్లుగా ఇటీవల ఒక ఫొటో బయటికి వచ్చింది. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే విజయం మీద నమ్మకం ఉంటే ఓకే కానీ.. అతి నమ్మకం మంచిది కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.  ఒకవేళ జగన్ గెలవకపోతే, ముఖ్యమంత్రి కాకపోతే పరిస్థితి ఏంటో కూడా ఒకసారి ఆలోచించాలి. ‘లీడర్’ సినిమాలో ఇక తాను సీఎం పదవిని అధిష్టించడం లాంఛనమే అనుకుంటుంది ధనుంజయ్ (సుబ్బరాజు చేశాడు) అనే పాత్ర. కానీ అతడికి అర్జున్ (రానా) షాకిస్తాడు. తన కల భగ్నం అయ్యాక సీఎం ధనుంజయ్ అనే నేమ్ బోర్డు చూసుకుని కుమిలిపోతాడు. జగన్ నేమ్ బోర్డు చూసిన వాళ్లు ఆ దృశ్యాన్ని గుర్తు చేస్తూ పరిస్థితి ఇలా అవుతుందేమో అని హెచ్చరిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English