మీ అధికారాలేంటో తెలుసా? ఈసీపై సుప్రీం ఫైర్!

 మీ అధికారాలేంటో తెలుసా?  ఈసీపై సుప్రీం ఫైర్!

మ‌రోసారి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకు కోపం వ‌చ్చింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై సుప్రీం ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు సంబంధించిన నేత‌లు అదే ప‌నిగా ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘిస్తున్నా.. దానికి సంబంధించి సీఈసీ తీసుకున్న చ‌ర్య‌ల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

తాజాగా నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పైన దాఖ‌లైన పిటిష‌న్ ను విచారించిన సుప్రీం.. ఎన్నిక‌ల సంఘం ప‌ని తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాన‌పార్టీల నేప‌థ్యంలో అదే ప‌నిగా నోరు జారుతున్నా.. చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించింది.

అస‌లేం చేస్తున్నారు?  ఎంత‌మందికి మీరు నోటీసులు పంపారు?  మీ అధికారాలేంటో మీకు తెలుసా?  ఒక‌వేళ మీరు స‌రైన స‌మాధానాలు చెప్ప‌క‌పోతే.. చీఫ్ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ను పిల‌వాల్సి వ‌స్తుంది? అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గొగొయ్ .. యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ మాట‌ల్ని ప్ర‌స్తావించారు. ఇదే స‌మ‌యంలో బీఎస్పీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మాట‌ల్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

ఇలాంటి వాటిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని సీఈసీ త‌ర‌ఫు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించారు. అయితే.. ఆ కేసు క్లోజ్ అయ్యింద‌ని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీం ధ‌ర్మాస‌నం.. ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌తినిధిని త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని పేర్కొంది.

కుల‌..మ‌త ప‌ర‌మైన విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేసిన వారికి ఎలాంటి చ‌ర్య‌లు.. శిక్ష‌లు ఉంటాయో త‌మ‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. ఇప్ప‌టికే విప‌క్షాలు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ని తీరు స‌రిగా లేద‌ని.. ఈవీఎంలలో సాంకేత ఇబ్బందులు ఎదురైన‌ట్లుగా ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌దిత‌రులు ఆరోపిస్తున్న వేళ‌లోనే.. సుప్రీం సైతం ఈ తీరులో స్పందించ‌టం గ‌మ‌నార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English