అండ‌ర్‌వేర్ కామెంట్లు..నేను చ‌స్తేనే నీకు తృప్తి ఉంటుందా?

అండ‌ర్‌వేర్ కామెంట్లు..నేను చ‌స్తేనే నీకు తృప్తి ఉంటుందా?

నిస్సిగ్గు కామెంట్ల‌కు సుప‌రిచితుడు అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, రాంపూర్ నియోజకవర్గ అభ్యర్థి ఆజంఖాన్ మ‌రోమారు దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం ఎన్నికల సభలో మాట్లాడుతూ,  తనపై పోటీ చేస్తున్న బీజేపీ నాయకురాలు, నటి జయప్రద లోదుస్తులు ఫలాన రంగులో ఉన్నాయంటూ  అనుచిత వ్యాఖ్యలు చేశారు. తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన‌ ఆజంఖాన్‌పై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయనకు త్వరలోనే నోటీసులు పంపనున్నామని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్శ ఇప్పటికే తెలిపారు.

ఆజంఖాన్ వ్యాఖ్య‌ల‌పై  రాంపూర్ బీజేపీ అభ్యర్థి జయప్రద స్పందించారు. ఆజంఖాన్ తనపై వ్యాఖ్యలు చేయడం ఇది మొదటి సారి కాదన్నారు . 2009లోనూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఆజంఖాన్ కు తానేం అన్యాయం చేశానో తెలియదని అన్నారు. ఆజంఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని జయప్రద డిమాండ్ చేశారు. ఆజంఖాన్ లాంటి వారు గెలిస్తే ప్రజాస్వామ్యం ఏమవుతుందని ప్రశ్నించారు. సమాజంలో మహిళలకు స్థానం లేదా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మాట‌లు మాట్లాడే వారిని ఎన్నుకుంటారా అని ఆమె రాంపూర్ ప్ర‌జ‌ల‌ను ప్ర‌శ్నించారు. ఇలాంటి వారిని ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నివ్వ‌కూడద‌ని, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని జ‌య‌ప్ర‌ద అన్నారు.

నేను చావాలా.. అప్పుడు నీకు తృప్తిగా ఉంటుందా అని జ‌య‌ప్ర‌ద త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా మాట్లాడితే నేను భ‌య‌ప‌డి రాంపూర్ వ‌దిలి పోతావేమో అనుకుంటున్నావు, కానీ వ‌దిలి వెళ్లేది లేదు అని జ‌య‌ప్ర‌ద అన్నారు. ఇదిలాఉండ‌గా, తాను జయప్రదను ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని ఆజంఖాన్ వివరణ ఇచ్చారు. కాగా,ఆజంఖాన్ వ్యాఖ్య‌ల‌పై స‌మాజ్‌వాదీ పార్టీ స్పందించ‌లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English