ఎన్ని ఎలక్షన్లు వచ్చినా ఆ హామీ మాత్రం మారదు

ఎన్ని ఎలక్షన్లు వచ్చినా ఆ హామీ మాత్రం మారదు

తరాలు మారుతున్నా.. నాయకులు మారుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు మాత్రం మారడం లేదు. ప్రధానంగా జాతీయ పార్టీలైతే కొన్ని అంశాలను దశాబ్దాల నుంచి చెబుతున్నాయే కానీ అమలు చేయడంలో మాత్రం చేతులెత్తేస్తున్నాయి. ప్రధాన పార్టీలుబీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలను చూస్తే అలాంటి అంశాలు కనిపిస్తాయి.

కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రతిసారీ పేదరిక నిర్మూలన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఆ పార్టీయే ఈ దేశాన్ని ఎన్నో ఏళ్లు పాటు పాలించింది. కానీ, పేదరిక నిర్మూళన మాత్రం సాధ్యం చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీయే కనుక పేదరిక నిర్మూలన చేసి ఉంటే ఈ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం ప్రకటించల్సిన అవసరమే లేకపోయేది. తన నాయనమ్మ కాలం నుంచి తన కాలం వరకు కాంగ్రెస్ పాలకులు చేసిందేమీ లేకపోవడంతోనే పేదరిక నిర్మూలన అనే కాంగ్రెస్ హామీ ఆ పార్టీ మేనిఫెస్టోలో స్థిర నివాసం ఏర్పరుచుకుంది.

ఇక బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌కు ఏమాత్రం తీసిపోలేదు. అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి బీజేపీ తన మేనిఫెస్టోలో పెట్టని ఎన్నికలు లేవు. ప్రతిసారీ అదే నినాదం. ఆ నినాదమే బీజేపీని ఈ స్థాయికి తెచ్చిందన్నదీ వాస్తవమే. కానీ, రామమందిర నిర్మాణం మాత్రం వాస్తవరూపం దాల్చలేదు. ఈసారి కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిర నిర్మాణం గురించి ప్రస్తావిచింది. నిర్మించి తీరుతామని చెప్పింది. కానీ, అదెప్పుడన్నది మాత్రం చెప్పలేదు.

మొత్తానికి ఈ దేశంలో ఎన్నికలు జరిగినంత కాలం ఈ రెండు పార్టీలూ పేదరిక నిర్మూలన చేస్తూనే ఉంటాయి, రామమందిరాన్ని కడుతూనే ఉంటాయని అనుకోవాలి. ఈ రెండు కార్యక్రమాలూ ఎప్పుడు పూర్తవుతాయో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English