మోడీకి షాకిచ్చేలా ప్రియాంక వార‌ణాసి బాణం!

మోడీకి షాకిచ్చేలా ప్రియాంక వార‌ణాసి బాణం!

తాజాగా జరుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తెర మీద‌కు తెచ్చిన ప్రియాంక గాంధీ త‌న మాట‌ల‌తో పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోతున్నార‌న్న భావ‌న ఇప్ప‌టికే విస్త‌రిస్తోంది. ఇలాంటి వేళ‌.. తాజాగా ఆమె ప్ర‌ధాని మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు ప‌లువురి దృష్టిని ఆక‌ట్టుకోవ‌ట‌మే కాదు.. ఆమె సంధించిన విమ‌ర్శ‌నాస్త్రం ప్ర‌ధానికి షాకిచ్చేలా ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మోడీని ఆకాశానికి ఎత్తేసే వారికి సైతం మింగుడుప‌డ‌ని రీతిలో.. ఆయ‌న తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలో ప్ర‌ద‌ర్శించిన నిర్లక్ష్యాన్ని తెర మీద‌కు తెచ్చారు. ప్ర‌ధానిగా ఉన్న వ్య‌క్తికి ఎన్ని బాధ్య‌త‌లు.. తాను ఎన్నికైన నియోజ‌క‌వ‌ర్గాన్ని చూస్తూ ఉండిపోతారా? అని ప్ర‌శ్నించొచ్చు. అదే మాట‌ను.. అంత పెద్ద ప్ర‌ధాని.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మీద ఆ మాత్రం దృష్టి పెట్ట‌లేరా? అన్న ప్ర‌శ్న కూడా వేయొచ్చు.

అసోంలోని సిల్చార్ లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీకి మ‌ద్ద‌తుగా నిర్వ‌హించిన రోడ్ షోలో మోడీ నిర్ల‌క్ష్యాన్ని ఆమె ప్ర‌శ్నించారు. ప్ర‌పంచ‌మంతా ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీకి తాను నేతృత్వం వ‌హించేవార‌ణాసిని సంద‌ర్శించ‌టానికి స‌మ‌యం దొర‌క‌లేద‌ని ఎద్దేవా చేశారు.

అమెరికా.. చైనా.. ర‌ష్యా.. పాక్.. జ‌పాన్ దేశాల అధినేత‌ల్ని ఆలింగ‌నం చేసుకున్న మోడీ వార‌ణాసిలో ఒక్క కుటుంబంతో అయినా ఐదు నిమిషాలు కూడా గ‌డ‌ప‌లేద‌ని.. వారి క‌ష్ట‌సుఖాల్ని తెలుసుకోలేద‌న్నారు. ఊరి బాధ్య‌త‌ను మోస్తున్నాన‌ని.. ఇంటి బాధ్య‌త‌ను మ‌రిస్తే ఎలా ఉంటుంది?  మోడీ తీరు కూడా అలానే ఉంద‌న్న విష‌యాన్ని ప్రియాంక తాజా వ్యాఖ్య‌ల్లో స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English