ధైర్యమంటే కేసీఆర్ దేనా?

ధైర్యమంటే కేసీఆర్ దేనా?

తాను అనుకున్నంతనే సెంటిమెంట్ ను రగిల్చే సత్తా ఉన్నోడికి.. సెంటిమెంట్ మూలాలు తెలీకుండా ఉంటుందా?  సెంటిమెంట్ ను తన ఇంటిమేట్ గా ఫీలయ్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు భిన్నంగా ఉంటుందని చెప్పాలి. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం కేసీఆర్ కు అలవాటే. కొన్ని జయంతులకు వెళ్లి విగ్రహాలకు పూలదండలు వేయటం.. కొన్ని కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావటం.. వెళ్లకపోతే తప్పుడు అర్థాలు వెతుకుతారన్న జంకుతో వెళ్లే వైనం చాలామంది నేతల్లో కనిపిస్తూ ఉంటుంది.

కానీ.. అలాంటి వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు కేసీఆర్. ఈ రోజు అంబేడ్కర్ జయంతి. దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొనటం లాంటివి చేస్తారు. కానీ.. కేసీఆర్ అలాంటివాటికి హాజరు కావటం కనిపించదు. అంతేకాదు.. ఈ రోజు శ్రీరామనవమి.

ఈ పండుగ సందర్భంగా భద్రాచలంలోని శ్రీరాములోరి కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు.. పట్టువస్త్రాలు తీసుకెళ్లటం ఆనవాయితీగా వస్తుంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. ముఖ్యమంత్రి దంపతులు స్వామివారికి వస్త్రాల్ని .. ముత్యాల తలంబ్రాల్ని తామే తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. కానీ.. కేసీఆర్ అలాంటి వాటికి వెళ్లటం కనిపించదు. ఇలా.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించే దమ్ము కేసీఆర్ కు మాత్రమే ఉందని చెప్పాలి.

తనకు నచ్చింది మాత్రమే చేస్తాను తప్పించి.. అందరికి నచ్చాలని చేయటం తనకు ఇష్టం ఉండదన్నట్లుగా కేసీఆర్ తీరు ఉంటుంది. ఏ కార్యక్రమానికి వెళ్లకుంటే.. ఏ వర్గానికి దూరం అవుతామోనన్న బెంగ కేసీఆర్ లో కనిపించదు. సెంటిమెంట్ ను చంకలో పెట్టుకొని తిరిగే తనను.. ఎవరేం చేయగలరన్న భావనలో .. మరింకేదో కానీ ఆయన తీరు ఎప్పుడూ ఆసక్తికరంగానే కాదు.. అర్థం కాని ఫజిల్ లా ఉంటుందని చెప్పక తప్పదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English