హ‌రీశ్‌తో చాలెంజ్‌...కేటీఆర్ డ్రాప్ అయిపోయాడే

హ‌రీశ్‌తో చాలెంజ్‌...కేటీఆర్ డ్రాప్ అయిపోయాడే

టీఆర్ఎస్ పార్టీ ట్ర‌బుల్ షూట‌ర్‌గా పేరొందిన మాజీ మంత్రి, గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావు విష‌యంలో ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెన‌క్కు త‌గ్గారు. త‌న మేన‌బావ‌తో చాలెంజ్ చేసిన కేటీఆర్‌..ఆ స‌వాల్ నుంచి మిడిల్ డ్రాప్ అయ్యారు. తాను స‌ర‌దాకు మాత్ర‌మే ఆ కామెంట్లు చేశాన‌ని స‌వాల్ గురించి వివ‌రించారు. ఎన్నికల‌ ఫ‌లితాల‌కు ముందే... ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే... కొద్ది కాలం క్రితం జ‌రిగిన మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఏకంగా హ‌రీశ్‌రావుకు స‌వాల్ విసిరారు. మెదక్‌ పార్లమెంట్‌ కంటే కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోనే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. దీనిపై మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులకు సవాల్‌ చేస్తున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం కంటే మేమే ఒక్క ఓటన్న ఎక్కువ తెచ్చుకొని మీ కంటే ముందుంటాం.`` అని కేటీఆర్‌ చెప్పారు.

అయితే, పోలింగ్ పూర్త‌యిన త‌ర్వాత తాజాగా కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన  సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ...మెదక్‌ సీఎం కేసీఆర్‌ ఇలాక అని, అక్కడ కచ్చితంగా టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ వస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రజలను ఉత్తేజపరచడానికే తన భావ హరీశ్‌ రావుతో సరదాగా ఛాలెంజ్‌ విసిరానని చెప్పారు. మెజారిటీలో మొదక్‌ మొదటి స్థానంలో, వరంగల్ రెండో స్థానంలో, కరీంనగర్‌ మూడు లేదా నాలుగో స్థానంలో నిలుస్తాయన్నారు. అయితే, కేటీఆర్ ఇలా మిడిల్ డ్రాప్ అవ‌డం స‌హ‌జంగానే ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English