రాహుల్ ఎంఫిల్ లెక్క తేడానా?

రాహుల్ ఎంఫిల్ లెక్క తేడానా?

కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీ విద్యార్హత మీద వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో డిగ్రీ చదివినట్లుగా నామినేషన్లో పేర్కొన్న ఆమె.. తాజాగా దాఖలు చేసిన నామినేషన్లో మాత్రం అండర్ గ్రాడ్యుయేట్ అన్న విషయాన్ని ప్రస్తావించటంతో కొత్త రచ్చ మొదలైంది. కేంద్రమంత్రి హోదాలో ఉంటూ తప్పుడు విద్యార్హతల్ని ఇస్తారా? అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

ఇలాంటి వేళ.. కేంద్రమంత్రి జైట్లీ గళం విప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్హత మీద సందేహాల్ని వ్యక్తం చేశారు. రాజకీయ వ్యూహంలో భాగంగా అని ఎంత చెప్పుకున్నా.. రాహుల్ ఎంఫిల్ పట్టా మీద జైట్లీ వ్యక్తం చేసిన సందేహాల్లో పస ఉందని చెప్పక తప్పదు.

అదెలానంటే.. రాహుల్ ఎంపిల్ విద్యార్హత మీద వివాదం తలెత్తినప్పుడు ఆయన 1995లో ఎంఫిల్ పట్టా అందుకున్నట్లు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పేర్కొంది. అయితే.. ఇందులో ఏదో తేడా ఉందన్న వాదన వినిపిస్తూ ఉంటుంది. తాజాగా జైట్లీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

1981-83 మధ్య రాహుల్‌, ప్రియాంకలు డెహ్రాడూన్‌లోని డూన్‌ స్కూల్‌లో చదివారు. 1984లో నాటి ప్రధాని ఇందిర హత్య ఉదంతంతో వారిద్దరినీ స్కూల్‌ మాన్పించి ఇంట్లోనే ఉంచి చదివించారు. అనంతరం ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలో రాహుల్‌ బీఏలో చేరారు. అక్కడ మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీకి మారారు.

1991లో రాజీవ్‌ హత్య నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా రాహుల్‌ను ఫ్లోరిడాలోని రోలిన్స్‌ కాలేజీకి బదిలీ చేశారు. రోలిన్స్‌ కాలేజీలో రావుల్‌ విన్సీ పేరుతో రాహుల్‌ 1994లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అయితే, ఏడాది వ్యవధిలోనే ట్రినిటీ కాలేజీ నుంచి ఎంఫిల్‌ పట్టా పుచ్చుకున్నారని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

ఎక్కడైనా డిగ్రీకి.. ఎంఫిల్ కు మధ్య ఏడాది మాత్రమే వ్యత్యాసం ఉండటం సాధ్యం కాదు. అందులోకి కేంబ్రిడ్జ్ లాంటి విశ్వవిద్యాలయంలో ఏడాదిలో ఎంఫిల్ చేయటం కుదరదు. మరి.. అలా చూసినప్పుడు రాహుల్ ఎంఫిల్ విద్యార్హత మీద సందేహాలు వ్యక్తం కావటంలో అర్థం ఉందని చెప్పక తప్పదు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English