సీఎం జగన్.. నేమ్ బోర్డు కూడా రెడీ!

సీఎం జగన్.. నేమ్ బోర్డు కూడా రెడీ!

ఈ సోషల్ మీడియా కాలంలో ఏది వాస్తవమో.. ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం. ట్విట్టర్లో అనేక ఆసక్తికరమై ఫొటోలు, వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఫొటోనే ఒకటి వైరల్ అవుతోంది. ‘వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అని ఉన్న నేమ్ బోర్డు ఫొటో అది. ఒక గదిలో ఫ్లోర్ మీద సీల్ ఓపెన్ చేసి పెట్టి ఉన్నట్లుగా ఉందా బోర్డు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా దర్శనమిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై జగన్ అండ్ కో ఎంత ధీమాగా ఉన్నారో తెలిసిందే. వందకు తక్కువ కాకుండా సీట్లు సాధిస్తామనే ధీమాతో ఉంది జగన్ బృందం.

తమ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అండ్ టీంతో నిర్వహించిన ఓ సమావేశంలో తాము ఆల్రెడీ గెలిచేసినట్లే మాట్లాడాడు జగన్. ఇదే తరహాలో 2024 ఎన్నికల్లోనూ పార్టీ విజయం కోసం పని చేయాలని ప్రశాంత్‌ను అడిగాడు. అతను సైతం పార్టీ విజయం పక్కా అన్నట్లే మాట్లాడాడు. ఏపీకు బెస్ట్ సీఎంగా ఉండమంటూ విష్ చేశాడు. వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలన్నీ కూడా విజయంపై చాలా చాలా ధీమాగా ఉన్నాయి. సెలబ్రేషన్ మూడ్‌లో కనినిపిస్తున్నారు నాయకులు, కార్యకర్తలంతా. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్ నేమ్ బోర్డు ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మరి ఇది ఒరిజినలా ఫేకా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే జగన్ అండ్ కోకు మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరం లేదని, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఎదురుచూడాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English