ఏంటి పవన్…మీడియాకు మొహం చాటేస్తున్నావు?

ఏంటి పవన్…మీడియాకు మొహం చాటేస్తున్నావు?

‘నేను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు` అంటూ ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేసిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. పోలింగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడకపోవడమే…ఈ చర్చకు కారణం. పోలింగ్‌ ముగిసిన అనంతరం మిగతా పార్టీలన్నీ తమ తమ అభిప్రాయాలను వెల్లడించినప్పటికీ….పవన్ మాత్రం తన భావనను వ్యక్తం చేయకపోవడం ఆసక్తికరంగా మారింది.

పోలింగ్ ముగిసిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. అదే రీతిలో, వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం మీడియాతో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం మీడియాకు దూరంగా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 ఏపీలోని తన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గడిపిన పవన్‌ ఈ సందర్భంగా రేడియో వింటున్నప్పటికీ కొన్ని ఫోటోలను మాత్రమే విడుదల చేశారే తప్పించి...మీడియాతో మాట్లాడలేదు. కాగా, ఏపీలో కీలక పార్టీగా జనసేన అవతరించబోతోందని, పెద్ద ఎత్తున సీట్లలో జనసేన గెలువనుందనే అంచనాలు కొందరు వేసినప్పటికీ...పోలింగ్‌ సమయంలో అలాంటి దోరణి కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. చెప్పుకోదగిన స్థానాల్లోనూ జనసేన గెలుస్తుందా? అనే చర్చ సైతం తెరమీదకు వస్తోంది. పవన్‌ మీడియాకు దూరంగా ఉండటం సైతం దీనికి ఆజ్యం పోస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English