ప్రతి దానికి జగన్ బ్యాచ్ ఈకలు పీకుతుందా?

ప్రతి దానికి జగన్ బ్యాచ్ ఈకలు పీకుతుందా?

ఉత్సాహం మంచిదే కానీ.. అత్యుత్సాహం అస్సలు సరికాదు. ప్రతి విషయానికి అదే పనిగా అడ్డదిడ్డంగా మాట్లాడటం.. అడ్డగోలుగా అభిప్రాయాలు వ్యక్తం చేయటం ఏ మాత్రం మంచిది కాదన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. డిఫెన్స్ గేమ్ ప్లాన్ ను టీడీపీ వర్గాలు అమలు చేస్తుంటే.. అటాకింగ్ వ్యూహాన్ని జగన్ పార్టీ నేతలు అనుసరిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.

విషయం ఏదైనా.. వీలైనంతవరకూ బాబు బ్యాచ్ లో కాన్ఫిడెన్స్ లెవల్స్ ను దెబ్బ తీయటమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. పోలింగ్ కు ముందే.. జగన్ గెలుపు ఖాయం.. జగన్ గెలుస్తున్నాడంటూ మౌత్ టాక్ ను స్ప్రెడ్ చేయటంలో సక్సెస్ అయిన వారు.. పోలింగ్ తర్వాత కూడా అదే తీరును ప్రదర్శిస్తున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా జగన్ బ్యాచ్ వినిపిస్తున్న కొన్ని వాదనలు ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నాయని చెబుతున్నారు.

పోలింగ్ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడటం కొందరు అధినేతలు చేస్తుంటారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు.. విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరు గురువారం రాత్రి మీడియా భేటీకి ఇన్విటేషన్లు పంపారు. అనుకున్నట్లే.. విపక్ష నేత జగన్.. ముందు చెప్పినట్లే మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు జరిగిన తీరు మీద రియాక్ట్ అయ్యారు. గెలుపు తమదేనని.. ప్రమాణస్వీకారం రోజు గురించి దేవుడే డిసైడ్ చేస్తారని ఆయన చెప్పారు. గెలుపు మీద ఫుల్ భరోసాను ప్రదర్శించారు జగన్.

విచిత్రంగా బాబు ప్రెస్ మీట్ మాత్రం క్యాన్సిల్ అయ్యిది. జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు.. బాబు మాత్రం తన మీడియా భేటీని ఎందుకు రద్దు చేసుకున్నారన్నది ప్రశ్నగా మారింది. బాబు ప్రెస్ మీట్ క్యాన్సిల్ కాగానే.. దానికి తనదైన కలర్ ఇచ్చేసిన జగన్ పార్టీ.. బాబు ముఖం చాటేశారని.. ఓటమిని ఆయన అంగీకరించినట్లేనని చెబుతున్నారు. వాస్తవం మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు చెబుతున్నారు. పోలింగ్ పూర్తి కాకపోవటం.. వేలాది మంది ఇంకా ఓట్లు వేసేందుకు నానా కష్టాలు పడుతుండం.. పోలింగ్ ప్రక్రియలో తెలుగు తమ్ముళ్లు బిజీగా ఉన్న వేళ.. తాను ప్రెస్ మీట్ పెట్టేసి గెలుపు ధీమాను ప్రదర్శిస్తే.. ఆఖరి నిమిషాల్లో తప్పులు జరగకుండా ఉండేందుకు వీలుగా.. బాబు ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేశారని చెబుతున్నారు.

ఆటలోనూ.. ఎన్నికల్లోనూ ఆఖరి నిమిషం వరకూ గెలుపు కోసం పోరాడుతూనే ఉండాలే తప్పించి.. మీడియాతో భేటీ పెట్టేసి కులాశాగా గెలుపు మాటలు చెబితే రాంగ్ సిగ్నల్స్ వెళతాయన్న ముందస్తు జాగ్రత్తతోనే ఈ వ్యూహాన్ని అమలు చేసినట్లు చెబుతున్నారు. దీనికి జగన్ పార్టీ నేతలు తమదైన వక్రభాష్యాన్ని చెబుతున్నారని మండిపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English