ఈ నాలుగు సీట్లపైనే బెట్టింగ్… తెలంగాణ హాట్ ట్రెండ్

ఈ నాలుగు సీట్లపైనే బెట్టింగ్… తెలంగాణ హాట్ ట్రెండ్

తెలంగాణలో కీలకమైన పోలింగ్ ట్రెండ్ ముగుస్తున్న తరుణంలో తదుపరి అంకంపై  అందరి దృష్టి పడింది. ఎన్నికల ప్రచారం సమయంలో సాగిన పోలింగ్ రోజున మరింత హీట్ కు చేరింది. ఓ వైపు ఎన్నికలు కొనసాగుతుంటే…మరోవైపు బెట్టింగ్ రాయుల్లు పందాల్లో బిజీ అయిపోయారు. తెలంగాణలోని నాలుగు ఎంపీ స్థానాలపై జోరుగా పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. చేవెళ్ల, మల్కాజ్ గిరి, ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలపై పందెం రాయుళ్లు లక్షలకు లక్షలు కాస్తున్నారు.

తెలంగాణలోని హాట్ సీట్లలో ఒకటైన మల్కాజ్ గిరిలోని కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై పందేలు కాస్తున్నారు. మిగతా నియోజకవర్గాలు, అభ్యర్థుల కంటే కూడా రేవంత్ రెడ్డిపై పందెం కాయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై భారీగా పందేలు కాస్తున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి, టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై పెద్ద ఎత్తున పందేలు నడుస్తున్నాయి. ఇక్కడా కాంగ్రెస్ రేణుకా వైపే బెట్టింగుల్లో మొగ్గు కనిపిస్తోందుండటం గమనార్హం.

మరోవైపు, ఎస్టీ రిజర్వుడ్ స్థానం మహబూబాబాద్ సీటుపైనా బెట్టింగులు జోరుగాసాగుతున్నాయి. కాంగ్రెస్కు పాజిటివ్ వాతావరణం ఉందనే కారణంతో బుకీలు ఈ సీటును పందేనికి తెచ్చినట్టు సమాచారం. ఇక్కడ రూ.లక్ష వరకు పందెం కాస్తున్నట్టు తెలిసింది. ఈ సీటుపై తొలుతఎక్కువ మంది టీఆర్ఎస్ క్యాండిడేట్ మాలోత్  కవితపైనే పందేలు కాయగా, బుధవారం ఉదయంనుంచి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పైనా బెట్టింగ్లు పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

కాగా, బెట్టింగ్ రాయుళ్లంతా ఫలితాల కోసం దాదాపు నెలన్నర వేచి చూడాల్సిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. నేటితో ముగుస్తున్న ఎన్నికల పర్వంలో కీలకమైన ఫలితాలు మే 23న వెలువడనున్న సంగతి తెలిసిందే. దీంతో బుకీల అంచనాల్లో నిజమెంతో తేలాలంటే…వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English