ఓట్లు వేసేందుకు ఏపీకి పోటెత్తుతున్న ఆంధ్రోళ్లు

ఓట్లు వేసేందుకు ఏపీకి పోటెత్తుతున్న ఆంధ్రోళ్లు

అంచనాలు నిజమయ్యాయి. అనుకున్నదే జరుగుతోంది. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు హైదరాబాద్ లో ఉన్న లక్షలాది ఆంధ్రోళ్లు ఏపీకి పోటెత్తుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రైళ్లలోనూ.. బస్సుల్లోనూ... ఇతర ప్రైవేటు వాహనాల్లోనూ బయలుదేరిన ఆంధ్రోళ్లు.. రాత్రి అయ్యేసరికి వెళ్లే వారి సంఖ్య మరింత ఎక్కువైంది.

ఒక్క సోమవారంనాడే దాదాపు నాలుగైదు లక్షల మంది జనం ఆంధ్రాకు పయనమైనట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. మంగళవారం ఉదయం హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవే మీద వాహనాలు పోటెత్తుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.

సంక్రాంతి పండక్కి ఏ రీతిలో అయితే వాహనాలు పెద్ద ఎత్తున రోడ్లను ముంచెత్తుతాయో.. ఇప్పుడు అంతకు మించినట్లుగా ఏపీకి వెళుతున్న వారి సంఖ్య ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇవి కాక రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ బస్సులతో పాటు.. ప్రైవేటు బస్సులు.. రైళ్లల్లోనూ వెళ్లే ప్లాన్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు రాత్రి (మంగళవారం) దాదాపు మూడువేలకు పైగా బస్సులు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళుతున్నాయి.

అంచనాలకు మించిన వస్తున్న వాహనాలతో జాతీయ రహదారులు కిక్కిరిపోతున్నాయి. బుధవారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతండి టోల్ గేట్ వద్ద వాహనాలు దాదాపు రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. భారీ ఎత్తున రద్దీ నెలకొన్న నేపథ్యంలో వాహనాల్ని వదిలేయాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోల్ గేట్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే పని చేస్తున్నారు. రానున్న గంటల్లో ఈ రద్దీ మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English