మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓటు ఎవరికంటే?

మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓటు ఎవరికంటే?

హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ rnకు ఇక ఒక రోజు మాత్రమే మిగిలింది. నిన్నటి వరకూ ప్రచారంలో తలమునకలైన rnఅధినేతలంతా ఇప్పుడు మైండ్ గేమ్ మీద.. కీలకమైన పోల్ మేనేజ్ మెంట్ మీద ఫోకస్ rnపెంచారు. ఇప్పటివరకూ జరిగిన ప్రచారం మీద రివ్యూ చేసుకుంటూ.. రానున్న 24 rnగంటల్లో ఏం చేయాల్సి ఉంటుందన్న అంశంపై అధినేతలు దృష్టి పెట్టారు.

ఇదిలాrn ఉంటే.. ఏపీలో నెలకొన్న రాజకీయం.. తాజా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై కేంద్ర rnమాజీ ఎన్నిక సంఘం  కమిషనర్ హరిశంకర్ బ్రహ్మ ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈrn సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో rnఉందని.. ఇలాంటివేళ చంద్రబాబు సమర్థ నాయకత్వం ఏపీకి ఎంతో అవసరంగా ఆయన rnఅభిప్రాయపడ్డారు.

ఇంతకీ బ్రహ్మకు.. ఏపీకి సంబంధం ఏమిటి?  ఏపీ rnరాజకీయాల గురించి ఆయన ఎందుకు మాట్లాడారంటే అందుకు కారణం లేకపోలేదు. rnప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఏపీకి కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. rnజలగం వెంగళరావు నుంచి చంద్రబాబు వరకూ పలువురు ఏపీ సీఎంల వద్ద ఆయన పని rnచేశారు. ఏపీకి సంబంధించి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయన సొంతం.

ఈ rnనేపథ్యంలో ఏపీ గురించి ఆయన మాట్లాడారు. ఏపీ విభజన తనను ఎంతో బాధించిందని.. rnవిభజన సమయంలో తాను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్నట్లు ఆయన చెప్పారు. rnతాజా రాజకీయ పరిణామాలు చూసినప్పుడు.. ఏపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో rnఉందని.. ఇలాంటి వేళ చంద్రబాబు లాంటి సీనియర్.. సమర్థమైన నాయకత్వ అవసరం rnఉందన్నారు.

వ్యక్తిగతంగా రాష్ట్ర విభజనను తాను వ్యతిరేకిస్తానని rnచెప్పే ఆయన విభజన తర్వాత ఏపీకి కేంద్ర సహకారం ఎలా ఉందన్న విషయంపై ఆయన తన rnఅభిప్రాయాన్ని దాచుకోలేదు. ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండడుగులు వెనక్కి rnలాగిన చందంగా ఏపీ పరిస్థితి తయారైనట్లు చెప్పారు. నిధుల కోసం ఢిల్లీ చుట్టూrn తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

చంద్రబాబు పాలనా దక్షత తనకు rnతెలుసని.. ఆయన వద్ద తాను పని చేసిన విషయాన్ని ప్రస్తావించిన బ్రహ్మ.. rnఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీకి చంద్రబాబు నాయకత్వ అవసరం ఎంతైనా ఉందని rnపేర్కొనటం గమనార్హం. ఏపీ వరకు ఇది అత్యంత క్లిష్టమైన సమయం. రాష్ట్రాన్ని rnముందుకు నడిపించే సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉందనిrn పేర్కొన్నారు. మరి.. ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English