మీ తమ్ముడు కూడా వచ్చాడుగా ఆలీ..

మీ తమ్ముడు కూడా వచ్చాడుగా ఆలీ..

ప్రస్తుతం కమెడియన్ ఆలీ చేసిన కొన్ని కామెంట్లు సర్వత్రా డిస్కషన్లకు దారితీస్తున్నాయి. రాజమండ్రిలో తనను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్‌ కామెంట్ చేశారని వేదన చెందిన ఆలీ.. వెంటనే ఒక వీడియో రికార్డు చేసి దానిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేజీ ద్వారా వందలమందికి షేర్ చేశారు. కాకపోతే ఆయన ఆవేదన కాస్త అర్ధరహితంగా ఉందనేది ఒక వాస్తవం.

నిజానికి పవన్ కళ్యాణ్‌ ను రాజకీయంగా ఆలీ చివాకులు పేల్చినా చురకలు అంటించినా బాగానే ఉండదమో కాని, ఆయన మాత్రం పవన్ కేవలం చిరంజీవి వేసిన బాట వలనే వచ్చారని, అదే తానయితే సొంతంగా పైకొచ్చానని కామెంట్ చేయడం ఎంతోమందిని హర్ట్ చేసింది. మరోసారి టాలీవుడ్ లో నెపోటిజం టాపిక్ కు చర్చలేపింది. ఒకవేళ మెగాస్టార్ వలనే పవన్ ఇంత వాడైతే.. మరి ఆల్రెడీ స్టార్ కమెడియన్ అయిపోయిన ఆలీ.. తన తమ్ముడ్ని ఎందుకు స్టార్ చేయలేకపోయాడు? అనేది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న.

నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ తరువాత ఆయన పిల్లలందరూ సూపర్ స్టార్ యాక్టర్లు అవ్వలేదు.. హరికృష్ణ అండ్ తారకత్నగా కూడా కొందరు మిగిలిపోయారు. అలాగే మెగా ఫ్యామిలీ నుండి కొంతమంది నాగబాబు తరహాలో ఫేడవుట్ అయిపోయారు. అక్కినేని ఫ్యామిలీ వారసులంతా స్టార్లు కాలేదు. 'నెపోటిజం' కారణంగా ఎంటర్ అవ్వడం ఈజీయే కాని.. వారందరూ స్టార్స్ అయిపోతారంటే మాత్రం హాస్యాస్పదంగా ఉంటుంది. పైగా పవన్ కళ్యాణ్‌ వంటి టాప్ హీరో మీద అలాంటి కామెంట్లు చేయడం ఆలీకే చెల్లింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English