ఈ హగ్గుతో 'చెప్పను బ్రదర్' మర్చిపోయినట్లే

ఈ హగ్గుతో 'చెప్పను బ్రదర్' మర్చిపోయినట్లే

ఒకానొక టైములో పవన్ కళ్యాణ్‌ గురించి ఒక్క మాట చెప్పండి బాబోయ్ అని ఫ్యాన్స్ అరుస్తుంటే.. కాస్త ఇబ్బందిపడిన అల్లు అర్జున్, వెంటనే 'చెప్పను బ్రదర్' అనేశాడు. అది కోపంలో చేసిన కామెంటే కాని, చిలికిచిలికి గాలి వాన అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. పవన్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఆర్మీ మధ్యన ట్వీటేస్తే చాలా భగ్గుమనే రేంజుకు సెగలు ఎగిసిపడ్డాయ్.

ఇకపోతే మొన్నామధ్యన శ్రీరెడ్డి మ్యాటర్లో పవన్ కళ్యాణ్‌ మూవి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు వెళ్ళినప్పుడు, వెంటనే అక్కడకు చేరుకున్న బన్నీ, తమ మధ్యన ఇష్యూస్ లేవని చెప్పకనే చెప్పాడు కాని.. ఆ సీన్ తాలూకు రీచ్ చాలా తక్కువగానే ఉంది. అయితే ఇప్పుడు పాలకొల్లు వెళ్ళి జనసేన ఎలక్షన్ సభలో పాల్గొన్న స్టయిలిష్‌ స్టార్.. ఏకంగా పవన్ నుండి ఒక కౌగిళింతతో స్వాగతం అందుకున్నాడు. ఈ హగ్గు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. మరి ఇప్పటికైనా చెప్పనుబ్రదర్ కామెంట్ కారణంగా చెలరేగిన మంటలన్నీ ఆరిపోయినట్లే అనుకోవాలా? ఖచ్చితంగా ఆరిపోయాయ్ అంటున్నారు కొందరు అభిమానులు.

ఏదేమైనా కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ వెన్నంటే ఉన్నామంటూ చెప్పకనే చెప్పేశారు. చరణ్‌ నుండి బన్నీ వరకు, వరుణ్‌ నుండి నిహారిక వరకు.. అందరూ సపోర్టు ఇచ్చేశారు. ఒక్క చిరంజీవి మాత్రమే అటు కాంగ్రెస్ తరుపున బయటకురాక, ఇటు పవన్ గురించి కామెంట్ చెయ్యలేక కాస్త సతమతం అవుతున్నట్లున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English