అల్లు అర్జున్‌ అక్కడి దాకా వెళ్లాడు

అల్లు అర్జున్‌ అక్కడి దాకా వెళ్లాడు

జనసేన ప్రచారంలో మెగా హీరోలెవరూ పవన్‌తో కలిసి రాలేదనే అభిమానుల అసంతృప్తి కాస్తయినా తీరింది. వరుణ్‌ తేజ్‌ తండ్రి కోసం రోడ్‌ షో నిర్వహిస్తే, చరణ్‌ పార్టీ ఆఫీస్‌కి వెళ్లి పవన్‌ని పలకరించి 'గాజుగ్లాసు'లో టీ తాగాడు. అల్లు అర్జున్‌ ఇంకో అడుగు ముందుకేసి పవన్‌ ప్రసంగిస్తోన్న వేదికపైకి ఎక్కి నిలబడ్డాడు. పాలకొల్లులో ఎన్నికల ప్రచారం చివరి రోజున పవన్‌తో అల్లు అర్జున్‌ కలిసి నిలబడ్డాడు. మెగా కుటుంబానికి చెందిన యువ నటులని రాజకీయాలకి దూరంగా వుంచాలని పవన్‌ స్వయంగా నిర్ణయించుకున్నాడు.

ప్రచారం చేయడానికి మెగా హీరోలు సిద్ధంగా వున్నా కానీ తన సిద్ధాంతాలు, తన ఆలోచనలు వారి కెరియర్‌ని డిస్టర్బ్‌ చేయరాదని భావించి పవన్‌ వారిని రావద్దన్నాడు. అయితే పవన్‌ అస్వస్థతకి లోనయి, ప్రచారంలో కీలక దశలో ఎనర్జీ కోల్పోవడంతో అతనికి బాసటగా నిలిచేందుకు మెగా హీరోలు కదలి వెళ్లారు. జనసేన గెలుస్తుందా లేదా అన్నదాని కంటే మెగా కుటుంబం అంతా ఒకే తాటిపై వుందనే విషయాన్ని ఇది స్పష్టం చేసింది. చిరంజీవి కోసం వచ్చినట్టుగా మెగా హీరోలంతా ప్రచారానికి రాకపోయినప్పటికీ పవన్‌కళ్యాణ్‌కి కుటుంబ అండదండలయితే వున్నాయని తేటతెల్లమయింది. దీంతో మెగా అభిమానుల్లో ఆనందం పెల్లుబుకుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English