బాబును ఆ పెద్దాయన అంతలా పొగిడేసారేంటి?

బాబును ఆ పెద్దాయన అంతలా పొగిడేసారేంటి?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బలాన్ని.. అధిక్యతను స్పష్టంగా ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల ప్రచారం వేళ.. జాతీయ నాయకులతో తనకున్న పరిచయాల్ని.. వారితో తనకున్న దగ్గరితనాన్ని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లు వచ్చి బాబు గొప్పతనాన్ని కీర్తించి.. ఆయన అవసరం ఏపీకి ఎంత ఉందన్న విషయాన్ని తమ మాటల్లో చెప్పారు. తాజాగా మరో పెద్దమనిషి ఎన్నికల ప్రచారానికి వచ్చి బాబు గొప్పతనాన్ని.. ఆయన పాలనా దక్షతను చెప్పిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మాజీ ప్రధాని దేవెగౌడ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తన మిత్రుడైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన.. బాబు సమర్థత మీద ప్రశంసల జల్లు కురిపించారు. భావి ప్రధానిగా బాబును దేవెగౌడ కీర్తించటం గమనార్హం.  బాబును పొగిడిన దేవెగౌడ.. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మోడీ.. తర్వాత హ్యాండ్ ఇచ్చిన వైనాన్ని ప్రస్తావించారు.

బాబును కాబోయే ప్రధానిగా అభివర్ణించిన దౌవెగౌడ మాటలు విన్నప్పుడు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చంద్రబాబుకు మధ్యనున్న వ్యత్యాసం ఇట్టే తెలుస్తుందని చెప్పక తప్పదు. ఉమ్మడి రాష్ట్రంలో బాబు చేసిన సేవ గురించి కీర్తించిన దేవెగౌడ.. ఐటీ.. కొత్తగా రోడ్లు వేయటం.. మౌలిక వసతులు.. ఉద్యోగాల కల్పన లాంటివెన్నో చేశారన్నారు.

చంద్రబాబు చేసిన పనుల్ని చూడటానికి నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ స్వయంగా రావటాన్ని ప్రస్తావించారు. మౌలిక విధానాల పరంగా చంద్రబాబు విశ్వసనీయతను ఎవరూ ప్రశ్నించలేనిదన్న ఆయన.. ఏపీ కోసం బాబు రాజీ లేని పోరాటం చేస్తున్నారన్నారు. అదే సమయంలో.. జగన్ పై ఆయన తీవ్ర విమర్శలు సంధించారు. అనేక అవినీతి ఆరోపణల్లో మునిగి తేలుతున్న జగన్ లాంటి వ్యక్తుల గురించి తాను మాట్లాడనని తేల్చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English