ఎన్టీఆర్‌ పని బాగుంది

ఎన్టీఆర్‌ పని బాగుంది

ప్రజారాజ్యం వచ్చినపుడు చిరంజీవిని కౌంటర్‌ చేయడానికి తెలుగుదేశం తమ వద్ద వున్న తారాబలం మొత్తం వాడేసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ని కూడా బరిలోకి దించి అతనితో విస్తృతంగా ప్రచారం చేయించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్‌ కూడా జరిగింది. అటుపై తెలుగుదేశం పార్టీలో హరికృష్ణకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్‌ హర్ట్‌ అయి పార్టీ వ్యవహారాలకి దూరంగా వున్నాడు. తండ్రి మరణం తర్వాత చంద్రబాబు అతనితో రాజీ చేసుకున్నా కానీ రాజకీయాలపై ఎన్టీఆర్‌ ఖచ్చితమైన సిద్ధాంతంతో వున్నాడు.

ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ తరఫున ప్రచారం చేయరాదని ఎన్టీఆర్‌ డిసైడ్‌ అయ్యాడు. అందుకే అంత ఒత్తిడి వున్నా కానీ తెలంగాణ ఎన్నికల వేళ ఎన్టీఆర్‌ కాలు బయటకి పెట్టలేదు. స్వయానా సోదరి బరిలోకి దిగినా కానీ తారక్‌ అలా సైలెంట్‌గా వుండిపోయాడు. ఏపీ ఎన్నికలకి అయినా ఎన్టీఆర్‌ని వాడతారని భావించారు కానీ ఈసారి కూడా అతను రానని తెగేసి చెప్పేసాడు. ఎన్టీఆర్‌ హ్యాపీగా ఎలాంటి టెన్షన్‌ లేకుండా వుంటే పవన్‌ పోటీలో వుండడం వల్ల మెగా హీరోలకి మాత్రం రాజకీయాల జోలికి పోక తప్పడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English