పవనా.. మనం కూడా తక్కువ తినలేదుగా?

పవనా.. మనం కూడా తక్కువ తినలేదుగా?

నీతులు మాట్లాడటం వేరు. వాటికి కట్టుబడి ఉండి అమలు చేయటం వేరు. మాటల్లో చెప్పే విలువలు చేతల్లో చేయటం ఎంత కష్టమన్న విషయం తాజా ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు అర్థమై ఉంటుంది. సమకాలీన రాజకీయాల్లో బతికి బట్టకట్టాలంటే ఓటర్లకు డబ్బులు పంచాల్సిన వైనం తెలిసిందే. మరి.. ఇందుకు దూరంగా ఉంటాం.. మడి కట్టుకొని కూర్చుంటామంటే కుదరన్న విషయం జనసేన అభ్యర్థి బాగానే తెలుసుకున్నట్లున్నారు.

అధినేత మాటలకు భిన్నంగా చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి రామచంద్రయాదవ్ తాజాగా ఓటర్లకు ఎర వేస్తూ అడ్డంగా బుక్ అయినట్లుగా చెబుతున్నారు. ఒక్కో ఓటరుకు రూ.2వేల చొప్పున టోకన్ ఇస్తూ దొరికి పోయిన వైనం సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది. టోకెన్లు పంపిణీ చేస్తున్న 12 మంది జనసేన కార్యకర్తల్ని పలు ప్రాంతాల్లో అదికారులు పట్టుకోవటం గమనార్హం. ఈ ఎపిసోడ్ కు సంబంధించి ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

తమ పార్టీ విలువలతో కూడుకున్నదని.. తాము ఓటర్లకు ఎర వేయమని చెప్పే పవన్ మాటలకు భిన్నంగా పుంగనూరులో జనసేన అభ్యర్థి ఓటర్లకు పంపిణీ చేసే నగదుకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేశారు. రూ.2వేల టోకెన్లను పంచటం..వాటిని ఒక ప్రదేశానికి వెళ్లి మార్చుకోవాల్సిందిగా చెబుతున్నారు. ఇలా పంపిణీ చేస్తున్న 600 టోకెన్లను ఎన్నికల అధికారులు పట్టుకొని.. వారిపై కేసులు నమోదు చేశారు. విలువలు మాట్లాడే పవన్ కు.. పుంగనూరు అభ్యర్థి ఎపిసోడ్ వివరాలు అందాయా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English