ఫేస్ బుక్ లో ప్రచారానికి పార్టీలు పెట్టే ఖర్చు లెక్కలు ఇవే

ఫేస్ బుక్ లో ప్రచారానికి పార్టీలు పెట్టే ఖర్చు లెక్కలు ఇవే

ఇవాల్టి రోజున చేతిలో సెల్ ఫోన్.. అందులో ఫేస్ బుక్ వాడనోళ్లు చాలా తక్కువ మంది. జియో ఎంట్రీ ఇచ్చాక డేటా వినియోగం భారీగా పెరగటం తెలిసిందే. ఇవాల్టి రోజున దేశంలో అత్యంత చౌకైన వస్తువ ఏమిటి? అంటే.. జియో డేటా అనే మాట చిన్న పిల్లాడి నుంచి పెద్దోళ్ల వరకూ వినిపిస్తూ ఉంటుంది.

మరి.. ఇంత చౌకగా డేటా అందుబాటులోకి వచ్చినప్పుడు.. చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను వాడుతూ.. డేటాను వినియోగిస్తూ.. సోషల్ మీడియా.. వీడియోలు వీలైనంత ఎక్కువగా చూడటం తెలిసిందే.

ఇక.. ఇలాంటి పరిస్థితికి ఎన్నికలు తోడైతే.. సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా ఉంటుంది. ప్రజల అభిరుచికి తగ్గట్లుగా పార్టీలు మెసులుకోవటం మామూలే. సోషల్ మీడియాలో పార్టీ తరఫున భారీగా ప్రచారాన్ని నిర్వహించటానికి వీలుగా వివిధ పార్టీలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం.. అమలు చేస్తున్నాయి కూడా.

సోషల్ మీడియాలో మోడీని మళ్లీ ప్రధానిని చేయాలన్న వీడియోలు.. ప్రచారం జోరుగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే.. సోషల్ మీడియాలో ప్రచారానికి బీజేపీ బ్యాచ్ భారీగా ఖర్చు చేయటమే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఫేస్ బుక్ వాడుతున్న నేపథ్యంలో.. అందులో మోడీ పరివారం.. భారీగా ప్రచార ప్లాన్ వేసింది. ఈ విషయం ఫేస్ బుక్ కు చెందిన యాడ్ లైబ్రరరీ రిపోర్ట్ చెప్పేస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చిలలో రాజకీయ పార్టీలు.. వాటి మద్దతుదారులు సోషల్ మీడియాలో ప్రచారం కోసం పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?  అక్షరాల రూ.10.32 కోట్లు. ఇందులో అత్యధికంగా ఖర్చు చేసింది మోడీ బ్యాచ్ కావటం గమనార్హం.

మార్చి 23తో ముగిసిన కాలానికి ఫేస్ బుక్ లో ప్రకటనల సంఖ్య 41,974గా లెక్క తేలింది. ఈ ప్రకటలన్నీ రాజకీయ.. జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలతో నిండి ఉన్నట్లు చెబుతున్నారు. ఇక.. ఈ వీడియోల్లో అత్యధిక భాగంగా బీజేపీదే. ఈ పార్టీ తరఫున భారీ సంఖ్యలో వీడియోలు ఉన్నాయి. భారత్ కి మన్ కీ బాత్ పేజీ ఈ ప్రచారంలో అగ్రస్థానంలో ఉంది. ఇందులో 3700 ప్రకటనలు వచ్చాయని.. వీటిపై రూ.2.23కోట్ల ఖర్చు చేసినట్లుగా వెల్లడించారు. మై ఫస్ట్ ఓట్ వర్ మోడీ.. నేషన్ విత్ నమో లాంటి ఫేస్ బుక్ పేజీలపైనా భారీగా ఖర్చు చేశారు. బీజేపీ పరివారం ఫేస్ బుక్ లో ప్రచారానికి ఈ స్థాయిలో ఖర్చు చేస్తే.. కాంగ్రెస్ మాత్రం మొత్తం 410 ప్రకటనల్ని మాత్రమే విడుదల చేసింది.

ఫిబ్రవరి నుంచి మార్చి 30 వరకు కాంగ్రెస్ రూ.5.91 లక్షలు ఖర్చు చేస్తే.. బిజూ జనతాదళ్ రూ.8.56 లక్షలు.. టీడీపీ రూ.1.58 లక్షలు.. ఎన్సీపీ రూ.58వేల వరకూ ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. మరికొన్ని పార్టీలు కొన్ని ఏజెన్సీల ద్వారా ప్రచారం చేయటంతో వాటి వివరాలు బయటకు రాని పరిస్థితి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English