ఎన్నికలంటే ఆ మాత్రం హాట్ హాట్ గా లేకుంటే కిక్ ఉండదు

ఎన్నికలంటే ఆ మాత్రం హాట్ హాట్ గా లేకుంటే కిక్ ఉండదు

ఎన్నికలు అంటే ఎలా ఉండాలి?  ఎంత హాట్ హాట్ గా ఉండాలి?  పోటాపోటీగా ఎన్నికలు సాగితే పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తున్నాయ్ ఏపీలో జరుగుతున్న తాజా ఎన్నికలు. మూడున్నర నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాయి. ఆ ఎన్నికలే పోటాపోటీగా జరిగినట్లుగా ఫీలైనోళ్లు చాలామందే.

కానీ.. తాజాగా ఏపీలో జరుగుతున్న ఎన్నికల ముందు మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు టుమ్రీ ఎన్నికలుగా చెప్పక తప్పదు. అధికార పక్షానికి ధీటుగా బలమైన ప్రధాన ప్రతిపక్షం ఉంటే ఎన్నికలు ఎంత రంజుగా ఉంటాయన్నది తాజాగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.  రెండు మదపటేనుగులు తలపడితే ఎలా ఉంటుందో ఇంచుమించు అలాంటి పరిస్థితే తాజాగా ఏపీలో నెలకొందని చెప్పాలి.

ఏపీలో జరుగుతున్న ఎన్నికల పోరును చూస్తున్నోళ్లంతా  తెలంగాణలో ఈ మధ్యనే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ప్రతిపక్షం బలంగా ఉంటే ఎన్నికల్లో పోటీ ఏ స్థాయిలో ఉంటుందో తాజా ఎన్నికలు స్పష్టం చేశాయని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల వేళకు కాస్తో కూస్తో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఆ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ఆ పార్టీ ఉనికే అనుమానాస్పదంగా మారిన పరిస్థితి. అరకొరగా ఉన్న ఆ పార్టీ నేతలు.. తాజా లోక్ సభ ఎన్నికల్లో తమ ఆస్తిత్వం కోసం కోట్లాడుతున్నారని చెప్పాలి.

మరోవైపు.. ఏపీలో ఎన్నికల సీన్ ఇందుకు భిన్నంగా ఉంది. అధికారపక్షానికి ధీటుగా ఉండటమే కాదు.. తెలుగుదేశం పార్టీకి ముచ్చమటలు పోసేలా విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఉందని చెప్పాలి.  ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న అంచనాను చెప్పలేనంత టైట్ గా ఎన్నికలు జరుగుతుండటం.. కాస్తో కూస్తో వైఎస్సార్ కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. గెలుపు ఎవరిదైనా.. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పోటాపోటీ వాతావరణం మాత్రం అదిరిపోయిందని చెప్పక తప్పదు.   


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English