శివాజీ చెప్పబోయే నిజాలేంటి.?

శివాజీ చెప్పబోయే నిజాలేంటి.?

ఎన్నికలకు ముందు నానా హడావుడి చేసిన శివాజీ ఆ తర్వాత సడన్‌గా సైలెంట్ అయ్యాడు. కొన్నాళ్లు ఆపరేషన్ గరుడ అన్నాడు. ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా ఆపరేషన్‌ గరుడు 2 కూడా వస్తుందని చెప్పాడు.  మొదట్లో తాను న్యూట్రల్‌గా ఉంటాను అని చెప్పుకోవడానికి ట్రై చేసిన శివాజీ.. ఆ తర్వాత టీడీపీ మద్దతుదారుడిగా మారిపోయాడు. పేరుకే పార్టీలో చేరలేదు కానీ.. పార్టీలో చేరిన వారికంటే ఎక్కువగానే టీడీపీకి సపోర్ట్‌ చేస్తున్నాడు.

        ఎన్నికల హడావుడి మొదలైన తర్వాత ఎక్కడా కన్పించని శివాజీ.. ఇప్పుడు ఒక వీడియో మళ్లీ  సంచలనం సృష్టిస్తున్నాంటూ ముందుకొచ్చాడు. అసలు ఏపీలో ఇన్నాళ్లు జరిగింది ఏంటి, వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు.. ఇవన్నీ కట్టలేదా, కడితే ప్రస్తుతం ఏ స్టేజ్‌లో ఉన్నాయి అని దగ్గరుండి నిరూపించే ప్రయత్నం చేయబోతున్నాడు శివాజీ. ఇందుకోసం రేపు ఉదయం అంటే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు లైవ్‌ ప్రెజంటేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

        మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై భారీ కుట్ర జరుగుతోందని చెప్పుకొచ్చాడు. కుట్రలకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న శివాజీ.. ఆదివారం ఉదయం కుట్రకు సంబంధించి ఆధారాలను మీడియాకు తెలియజేస్తానని ప్రకటించాడు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పదవి నుంచి తప్పించడం మోదీ కుట్రేనని వ్యాఖ్యానించాడు. మొత్తానికి  ఎన్నికలకు రెండు రోజుల ముందు ఏదో హడావుడి చేసేందుకు శివాజీ సిద్ధమయ్యాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English